NTV Telugu Site icon

Chiru: బర్త్ డే బాయ్స్ కి మెగా విషెస్… బన్నీ చేసిన తప్పు చిరు చెయ్యలేదు

Chiru

Chiru

మెగా ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, అల్లు అర్జున్ కి మిగిలిన హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అంటే మాట చాలా రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకి మరింత ఊతం ఇస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ మెగా-అల్లు కుటుంబాల మధ్యలో గ్యాప్ ఉంది అనే మాట ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది. అల్లు అర్జున్ చేసిన తప్పుని చెయ్యకుండా, కామెంట్స్ చేసే వాళ్లకి అవకాశం ఇవ్వకుండా మెగాస్టార్ చిరంజీవి, బన్నీకి బర్త్ డే విషెస్ చెప్తూ ట్వీట్ చేశాడు. యంగ్ హీరోల మధ్య ఎన్ని డిఫరెన్స్ లు ఉన్నా తనకి మాత్రం మెగా హీరోలంతా సమానమే, ఎవరి పట్ల పక్షపాతం లేదు అనేలా చిరు ట్వీట్ చేశాడు. పుష్ప ది రూల్ ఫస్ట్ లుక్ కూడా రాకింగ్ గా ఉంది అంటూ చిరు కాంప్లిమెంట్స్ అందించాడు. అల్లు అర్జున్ కి మాత్రమే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తే ఆయన మెగాస్టార్ ఎందుకు అవుతాడు. ఇదే రోజున అక్కినేని అఖిల్ కూడా పుట్టిన రోజు జరుపుకుంతుండడంతో చిరు, అఖిల్ కి కూడా బర్త్ విష్ చెప్తూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం చిరు చేసిన ట్వీట్స్ ని రీట్వీట్స్ కొడుతూ ఫాన్స్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు.

Read Also: Allu Arjun: సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఎత్తిన ప్రతి వేలు ముడుచుకునేలా చేశాడు…

Show comments