NTV Telugu Site icon

Megastar: మెగా టీజర్ లాంచ్ కి గ్రాండ్ ఈవెంట్…

Bholaa Shankar

Bholaa Shankar

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమలాపురం నుంచి అమెరికా వరకు ఆగస్ట్ 11 నుంచి జరగబోయే మెగా కార్నివాల్ కి రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు 11 నుంచి మెగా మేనియా, భోళా మేనియా స్టార్ట్ అవనుంది. మెగా స్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేస్తున్న భోళా శంకర్ సినిమా మేనియాని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్… ఈ మూవీ టీజర్ లాంచ్ కి రెడీ అయ్యారు. భోళా శంకర్ ప్రమోషన్స్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చేలా టీజర్ ని లాంచ్ చెయ్యాలనేది మేకర్స్ ప్లాన్. అందుకే భోళా శంకర్ టీజర్ ని రేపు సాయంత్రం 4 గంటలకి సంధ్య 70MM థియేటర్ లో ఈవెంట్ చేసి లాంచ్ చెయ్యనున్నారు. తమన్నా, కీర్తి సురేష్ లు కూడా నటిస్తున్న ఈ మూవీ అజిత్ నటించిన తమిళ సినిమా ‘వేదాళం’కి రీమేక్ గా తెరకెక్కుతోంది.

ఇటీవలే భోళా శంకర్ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘భోళా మేనియా’ సాంగ్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. చిరు చాలా యంగ్ గా కనిపిస్తుండడం విశేషం. భోళా శంకర్ సినిమా కూడా హిట్ అయితే ఒకే ఏడాదిలో రెండు హిట్స్ ఇచ్చిన టాప్ హీరోగా చిరు హిస్టరీ క్రియేట్ చేస్తాడు. అయితే మెగా అభిమానులు భయం మెహర్ రమేష్ గురించే. మెహర్ ట్రాక్ రికార్డ్ ని బ్రేక్ చేసి భోళా శంకర్ సినిమా సూపర్ హిట్ అవుతుందేమో అనే హోప్ తో మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఆగస్టు 11న మెహర్ రమేష్ తన ఫ్లాప్ స్ట్రీక్ కి బ్రేక్ ఇస్తూ… అందరి అనుమానాలని పటాపంచలు చేస్తే సూపర్ హిట్ ఇస్తాడేమో చేయాలి.