NTV Telugu Site icon

Ram Charan: అయ్యప్ప మాలలో ఆస్కార్స్ కి…

Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటివలే RC 15 వైజాగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షెడ్యూల్ కి వన్ మంత్ లాంగ్ బ్రేక్ వచ్చింది. దీంతో చరణ్ లాస్ ఏంజిల్స్ పయనమయ్యాడు. మార్చ్ 12న జరగనున్న ఆస్కార్ ఈవెంట్ కి చరణ్ అటెండ్ అవ్వనున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రైడ్ గా ‘ఆస్కార్స్ 2023’లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో నామినేట్ అయ్యింది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ గెలవడం గ్యారెంటీ అని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు.

Read Also: RRR: మరో రెండు ప్రెస్టీజియస్ ఫారిన్ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్

ఈ ప్రెస్టీజియస్ ఈవెంట్ లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, రాజమౌళి అంటే టీం రెడీ అవుతున్నారు. మార్చ్ 7న సింగర్స్ టీం లాస్ ఏంజిల్స్ వెళ్లనుంది. చరణ్ మాత్రం ఈరోజే వెళ్ళిపోయాడు. అయ్యప్పస్వామిమాలలో చరణ్, ఫ్లైట్ ఎక్కడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చాడు. ఈ సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారకరత్న అంత్యక్రియలు ముగిసి 24 గంటలు కూడా కాలేదు కాబట్టి ఎన్టీఆర్ ఇప్పుడే లాస్ ఏంజిల్స్ వెళ్లే అవకాశం లేదు. ఫిబ్రవరి 24న జరగాల్సిన ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ ని కూడా తారక్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే 2023 దాదా సాహెబ్ ఫాల్కే బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సొంతం చేసుకుంది. బెస్ట్ యాక్టర్స్ కేటగిరిలో చరణ్, ఎన్టీఆర్ లకి అవార్డ్ రాలేదు.

Show comments