2026 వేసవి బాక్సాఫీస్ వద్ద మెగా జాతర మొదలవ్వబోతోంది, ఇప్పటికే పవర్‌ఫుల్ లైనప్‌తో మెగా హీరోలు థియేటర్లను దండయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోగా, అదే ఊపును కొనసాగించేలా ‘మెగా సమ్మర్’ ప్లాన్ ఖరారైంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, మెగా కాంపౌండ్ నుండి రాబోతున్న చిత్రాల తాత్కాలిక షెడ్యూల్ ఇలా ఉంది.
Also Read:CM Chandrababu: నగరి టీడీపీకి కంచుకోట.. తప్పకుండా కృష్ణా జలాలు అందిస్తాం!
మార్చి 26, 2026 – ఉస్తాద్ భగత్ సింగ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ వేసవి ఆరంభంలోనే హీట్ పెంచనుంది.
మే 1, 2026 – పెద్ది: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మే డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జూలై 10, 2026 – విశ్వంభర: మెగాస్టార్ చిరంజీవి సోషియో-ఫాంటసీ విజువల్ వండర్ జూలైలో సమ్మర్ ముగింపును గ్రాండ్‌గా ముగించనుంది.
కేవలం ఈ ముగ్గురు అగ్ర హీరోలే కాకుండా, మెగా ఫ్యామిలీ నుండి యువ హీరోలు కూడా వేసవి వినోదాన్ని పంచేందుకు క్యూ కట్టారు. వరుణ్ తేజ్ నటిస్తున్న విభిన్నమైన ఇండో-కొరియన్ ప్రాజెక్ట్ కొరియన్ కనకరాజు ఏప్రిల్‌లో సందడి చేయనుంది.
సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్) నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ఎస్.వై.జి జూన్ నెలలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
