మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న “ఆచార్య” చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు ఆయన “లూసిఫర్” రీమేక్ తో సెట్స్ మీదకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో చిరు చికిత్స కోసం వైజాగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. చికిత్స అనగానే ఏమైందో అని కంగారు పడకండి. ఆయన షూటింగ్ కు వెళ్లేముందు డిటాక్సిడ్ అండ్ రిజునీవేనేటెడ్ అవ్వాలని అనుకుంటున్నారట. దానికోసం చిరు ఆయుర్వేద చికిత్స తీసుకోబోతున్నారట. అందుకోసమే చిరు వైజాగ్‌లోని ప్రముఖ ఆయుర్వేదిక్ స్పాలో ఉన్నాడని తెలుస్తోంది. ఇంతకుముందు కూడా చిరంజీవి ఇదే ఆయుర్వేద స్పాలో ఒక వారం గడిపాడు. ఆ సమయంలో నిర్మాత దిల్ రాజు కూడా ఆయనతో ఉన్నారు.
Read Also : “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అదుర్స్
సాధారణంగా మన హీరోలు ఈ డిటాక్సిఫికేషన్ ప్రక్రియ కోసం విదేశాలకు వెళ్తారు. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుండడంతో ఎవరూ దేశం దాటి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. అందుకే మెగాస్టార్ కూడా వైజాగ్‌కి పరిమితం అయ్యారు. ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పూర్తి కాగానే ఆయన తిరిగి వస్తారు. ఆ వెంటనే ‘లూసిఫర్’ షూట్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్‌తో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర కోసం మరో హీరోని వెతుకుతున్నారు. త్వరలోనే యూనిట్ సినిమా పేరును అధికారికంగా ప్రకటించనుంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు.
