Site icon NTV Telugu

Mega Star Chiranjeevi : త్రిశూలం తిప్పుతూ.. మహాశివరాత్రి స్పెషల్‌..

మెగా అభిమానులకు భోళాశంకర్‌ చిత్రయూనిట్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ సినిమా నుంచి అప్డేట్‌ విడుదల చేసింది. చిరంజీవి కథానాయకుడిగా తమన్నా కథానాయికగా.. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా ‘వైబ్‌ ఆఫ్‌ భోళా’ పేరుతో చిత్ర యూనిట్‌ ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది.

చిరంజీవి నుంచి ఈ మూవీలో కొత్తలుక్‌లో ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నారు. “అన్నాచెల్లెల అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న సినిమా ఇది. అయితే అన్ని రకాల వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం” అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో రఘుబాబు, రావు రమేష్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version