Site icon NTV Telugu

Allu Aravind: పొలిమేర హిట్.. అల్లు అరవింద్ అభినందనలు

Allu

Allu

Allu Aravind: సత్యం రాజేష్, కామాక్షి భాస్కరాల, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం పొలిమేర. డా.అనిల్ విశ్వనాథ్. ద‌ర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటిటీలో ఎంత హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దాదాపు మూడేళ్ళ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా పొలిమేర 2 వచ్చింది. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాడు. విడుద‌లైన రోజు నుంచి ప్రేక్షకాద‌ర‌ణ‌తో బ్లాక్‌ బ‌స్టర్ విజ‌యం దిశ‌గా చిత్రం కొన‌సాగుతుంది. ఈ సంద‌ర్భంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వంశీ నందిపాటిని అభినందిచాడు. పుష్పగుచ్చం ఇచ్చి అల్లు అరవింద్ ప్రశంసించాడు.

Akkineni Amala: ఆయన తెలుగు సినిమాకు ఒక పిల్లర్..

ఇక ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మంచి అభిరుచి గల వ్యక్తి వంశీ అని, మొదటి ప్రయత్నంలోనే చిరస్మరణీయమైన హిట్ అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు దేశీయంగా మరియు ఓవర్సీస్‌లో తొలి వారంలోనే ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయని, ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని ప్రేక్షకులకు అందించాలని అల్లు అరవింద్ కోరుకున్నాడు. ఇక పొలిమేర 2 హిట్ అందుకోవడంతో సక్సెస్ మీట్ ను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇంతటితో ఆగకుండా తమ సినిమాను ఇంతటి కమర్షియల్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘మా ఊరి పొలిమేర 2’ టీమ్ నవంబర్ 10 నుంచి ఆంధ్రాలో పర్యటించనుందని వంశీ నందిపాటి తెలిపాడు.

Exit mobile version