NTV Telugu Site icon

Ram Charan: వారికి రామ్ చరణ్ వార్నింగ్.. మా నాన్న జోలికి వస్తే.. ఊరుకోను ?

Chiru

Chiru

Ram Charan: “చిరంజీవి సౌమ్యుడని అందరూ చెబుతారు. ఆయన సైలెంట్గా ఉంటేనే ఇన్ని వేల మందిమి వచ్చాం. కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమవుద్దో ఇతరులకు తెలీదు. ఆయన నెమ్మదిగా ఉంటారేమో.. మేం నెమ్మదిగా ఉండం. అందరూ గుర్తుపెట్టుకోండి” అంటూ రామ్ చరణ్ వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 13 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. మంచి కలక్షన్స్ రాబడుతూ విజయ ఢంకా మోగిస్తున్న సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా విజయోత్సవ వేడుకను హనుమకొండలో ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో గగ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు.

ఇక ఈ వేదికపై రామ్ చరణ్ మాట్లాడుతూ.. ” వాల్తేరు వీరయ్య అభిమానులందరికి పూనకాలు తెప్పించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు అమెరికాకు వెళ్ళినప్పుడు వారు ఆర్ఆర్ఆర్ లో ఆ సాంగ్ ఎలా చేశారు అని అడుగుతున్నారు.. ఎలా చెప్పాలి వారికి.. ఇక్కడికి వచ్చి చూడండి. ఆ డ్యాన్స్ ఎలా ఉంటుందో.. వాల్తేరు వీరయ్య థియేటర్ లో చూడమని చెప్పాలి. ఇక సినిమా గురించి చెప్పాలంటే.. ముందుగా మైత్రీ మూవీ మేకర్స్ గురించి చెప్పాలి. దమ్ము ఉన్న ప్రొడ్యూసర్స్ అంటే వీరే.. వీరిని చూసి చాలా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు నేర్చుకోవాలి. ఇక బాబీ గారి గురించి చెప్పాలంటే.. మా నాన్నగారిని నాకు నాన్నలా కాదు అన్నలా చూపించారు. రోల్ రైడా ఆ పూనకాలు లోడింగ్ సాంగ్ ఎలా ఇచ్చాడో అభిమానులకు నిజంగానే పూనకాలు తెప్పించారు. కలక్షన్స్ మాములుగా లేవు. ఈ సినిమాకు నేను గెస్టుగా రాలేదు.. ఒక అభిమాని గా వచ్చా.. చిరంజీవి గారి ఫంక్షన్ కు ఆయనే గెస్ట్.. ఇంకెవరు అవసరం లేదు. ఈ సినిమా చూసి నేను ఎంత ఎంజాయ్ చేశానో ఇప్పటివరకు నాన్న గారికి కూడా చెప్పలేదు. ఆయనతో పాటు రవితేజ గారి కి మంచి సీరియస్ క్యారెక్టర్ ఇచ్చి దాన్ని కూడా ఎంజాయ్ చేసేలా చేసాడంటే బాబీకి హ్యాట్సాఫ్.

ఇక తమ్ముడంటే నాన్నగారికి ప్రాణం.. ఆ తమ్ముడు మీద ప్రేమ ఎలాంటిది అనేది వాల్తేరు వీరయ్యలో ఒక సీన్ లో తెలిసిపోతోంది. ఫేస్ లెఫ్ట్ తర్కింగ్ ఇచ్చుకో అని తమ్ముడు అన్నాడు కాబట్టి ఊరుకున్నారు. ఆ డైలాగ్ ఇంకెవరైనా అని ఉంటే ఏమయ్యేది. అది అన్నది ఆయన తమ్ముడు రవి కాబట్టి.. తమ్ముడంటే అంత ప్రేమ ఉంది కాబట్టి.. చిరంజీవి గారిని అనే హక్కు ఫ్యామిలీకి అభిమానులకు మాత్రమే ఉంది. మాములుగానే చిరంజీవి గారు చాల క్వైట్ గా ఉంటారు..చాల సౌమ్యులు అంటారు, ఆయన క్వైట్ గా ఉంటేనే ఇంత వేల మంది వచ్చారు అంటే, ఇతరులకు తెలీదు ఆయన కొంచెం బిగించి గట్టిగా మాట్లాడితే ఎం అవుద్ది అని, గుర్తుపెట్టుకోండి మేము అందరం వెనకాల క్వైట్ గా ఉండము, క్వైట్ గానే చెబుతున్నాం మేము క్వైట్ గా ఉండమని, చిత్రం కోసం పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు చిరంజీవిని ట్రోల్ చేసిన వారికి చరణ్ వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఆ ట్రోలర్స్ ఎవరు అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

Show comments