మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాష్ట్ర పర్యటనలో ఉన్నాడా అనే హెడ్డింగ్ చూసి ఇదేదో పొలిటికల్ క్యాంపెయిన్ న్యూస్ అనుకోకండి. చరణ్ రాష్ట్ర పర్యటనలో ఉన్నది నిజమే కానీ అది సినిమా విషయంలో మాత్రమే. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి RC 15 అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చెయ్యని ఈ సినిమాపై హ్యుజ్ హైప్ ఉంది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో భాగంగా RC 15 చిత్ర యూనిట్ గతంలో రాజమండ్రి వెళ్లారు, నిన్న హైదరాబాద్ లో షూట్ చేశారు. ఈరోజు కర్నూల్ కొండారెడ్డి బుర్జు దగ్గర షూటింగ్ చేస్తున్నారు.
ఇన్ని ప్రాంతాల్లో షూటింగ్ చెయ్యడం మాములే కానీ ఒకే ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ చేస్తున్నారు అంటే ఇది చరణ్ క్యారెక్టర్ పొలిటికల్ క్యాంపెయిన్ కి సంబంధించిన ఎపిసోడ్ అయ్యి ఉంటుంది. సాంగ్ మాంటేజ్ షాట్స్ ని కూడా షూట్ చేసే అవకాశం ఉంది. చరణ్ ‘అభ్యుదయం పార్టీ’ పెట్టి ఎన్నికల ప్రచారం చేసే సీన్స్ కి శంకర్ షూట్ చేస్తున్నాడు అందుకే తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో RC 15 షూటింగ్ జరుగుతోంది. మరి ఇవి కేవలం సాంగ్ లో వచ్చే మోంటేజ్ షాట్స్ మాత్రమేనా లేక సీన్స్ కూడా అనేది తెలియాలి అంటే RC 15 రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే. ఈ భారి బడ్జట్ సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ మార్చ్ 17న చరణ్ బర్త్ డే సంధర్భంగా లాంచ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయితే RC 15 పై ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరగడం గ్యారెంటీ.
