NTV Telugu Site icon

Akhira: నాన్న రాజకీయాల్లోకి, కొడుకు సినిమాల్లోకి… ఆరడుగుల బుల్లెట్ ఎంట్రీ ఎప్పుడు?

Akhira

Akhira

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ ని, అక్కినేని అఖిల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ సినీ అభిమానులంతా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం ‘అఖిరనందన్’కి విషెస్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమదైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం అఖిర ఎంట్రీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ వారసుడిగా అఖిర ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే, పవన్ ఫాన్స్ అంతా ‘యంగ్ పవర్ స్టార్’కి సపోర్ట్ చెయ్యడానికి రెడీగా ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ లాంటి వాటిలో ట్రైనింగ్ తీసుకున్న అఖిరనందన్ ఆరున్నర అడుగులు ఉంటాడు. పవన్ కళ్యాణ్ లో ఉండే స్వాగ్ ని అఖిర పుణికిపుచ్చుకున్నాడు, అందుకే అతని ఫోటోస్ ఎప్పుడు బయటకి వచ్చినా వెంటనే మెగా ఫాన్స్ వాటిని ట్రెండ్ చేస్తూ ఉంటారు.

Read Also: Naresh Pavitra: వీళ్ల ‘మళ్లీ పెళ్లి’ టీజర్ వచ్చేస్తోంది…

ఆరున్నర అడుగుల హైట్ ఉన్న హీరో మాస్ యాక్షన్ సినిమా చేస్తే థియేటర్స్ లో రచ్చ రచ్చ చేస్తారు ఫాన్స్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే ఎన్నికల రిజల్ట్స్ ని బట్టి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లిపోతాడు అనే మాట వినిపిస్తున్న నేపధ్యంలో పవన్ కళ్యాణ్ వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తండ్రి లెగసీని కంటిన్యు చేస్తే వెనకుండి నడిపించడానికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. మరి ఏ దర్శకుడు? ఏ సినిమాతో? ఎప్పుడు అఖిరని ఇంట్రడ్యూస్ చేస్తారు అనేది చూడాలి. ఈరోజు మాత్రం ఎప్పుడూ లేనంతగా అఖిరనందన్ ఫోటోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మెగా ఫాన్స్.

Show comments