Good Night Fame Meetha Raghunath gets engaged: ఒకప్పుడు ఉన్న భాషాబేధాలను ఈమధ్య ఓటీటీలు చెరిపేస్తున్నాయి. తెలుగులో డబ్బింగ్ చేసినా చేయకున్నా సినిమా బాగుంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూసేస్తున్నారు. అలాగే తమిళ గుడ్‌నైట్ సినిమాను తెలుగులో డబ్ చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయగా తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతగానో ఆదరించారు. ఈ ఏడాదిలో చిన్న సినిమాగా వచ్చిన గుడ్‌నైట్ సినిమా ఒక రేంజ్ హిట్‌ను సొంతం చేసుకుంది. మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్మార్పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై వచ్చిన ఈ సినిమాలో మణికందన్, మీతా రఘునాథ్ జోడీ అందరినీ ఆకట్టుకుంది. గుడ్‌నైట్ సినిమా కోసం ఎలాంటి మేకప్ లేకుండా ‘అను’ పాత్రలో మీతా రఘునాథ్ ప్రేక్షకులను భలే ఆకట్టుకుంది. గురక, మొహమాటం అనే చిన్న విషయాలను తీసుకుని అద్భుతమైన స్క్రీన్ ప్లేతో అభిమానులను అలరించాడు దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్. ఇక ఈ సినిమా చూసిన అబ్బాయిలు అందరూ అమ్మాయి అంటే ఇలా ఉండాలి.
Yash: కేజిఎఫ్ తర్వాత సినిమా అందుకే లేట్!
ఇలాంటి అమ్మాయే ప్రియురాలిగా దొరికితే లేదా పెళ్ళాంగా దొరికితే ఎంత బాగుండో అనేంతలా ఆమెను ఆరాధించారు. అయితే అంతలా ఆరాధించిన మీతా రఘునాథ్ ఇప్పుడు కుర్రాళ్ల గుండెలు పగిలే న్యూస్ చెప్పింది. అదేమంటే మీతా రఘునాథ్ తన పెళ్లి వార్తను ప్రకటించింది. తాజాగా మీతా నిశ్చితార్థం చేసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబోయే భర్తతో ఉన్న ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సైతం షేర్ చేసారు. అయితే ఫొటో షేర్ చేశారు కానీ, కాబోయే భర్త వివరాలతో పాటు పెళ్లి తేదీని సైతం ఆమె ప్రకటించాల్సి ఉంది. ఒకే సినిమాతో నేటి తరం యూత్ డ్రీం గర్ల్ గా మారిన మీతా రఘునాథ్ పెళ్లి వార్త కాస్త బాధ కలిగించేదే అయినా ఆమె మాత్రం ఆనందంగా ఉండాలి అని అంటూ అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.