NTV Telugu Site icon

The Goat Life: ఇతని జీవితం మీదనే సినిమా చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్

The Goat Life Movie

The Goat Life Movie

Meet Najeeb the inspiration for The Goat Life Movie: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించగా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించగా సినిమాకు మూలమైన నజీబ్ గురించి ప్రచార కార్యక్రమాల్లో మూవీ టీమ్ చెబుతున్న విషయాలు ప్రేక్షకుల మనసులను కదలిస్తున్నాయి. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి అరబ్ దేశాలకు వలస వెళ్లాడు నజీబ్ అనే ఒక అమాయక యువకుడు. ఎంతోమంది యువకుల్లాగే అతనూ గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసపోయి రెండేళ్లు ఏడారిలో ప్రయాణిస్తూ అనేక కష్టాలు పడతాడు. 700 గొర్రెలను కాపాడుకుంటూ అతని ఎడారి ప్రయాణం ఒక నరకప్రయాణంలా సాగుతుంది. నజీబ్ కు ఉన్న ఒకే జత బట్టలతో స్నానం చేసి దుస్తులు మార్చుకునేందుకు కూడా వీలుండక, తినేందుకు సరైన ఆహారం దొరక్క విపరీతమైన ఎడారి వాతావరణంలో ఊహాతీతమైన కష్టాలు ఎదుర్కొంటాడు.

KU Mohanan: నాకు ఆ పిచ్చి లేదు.. విజయ్ పర్ఫార్మెన్స్‌లో డ్రామా ఉండదు.. ఫ్యామిలీ స్టార్ సినిమాటోగ్రాఫర్ ఇంటర్వ్యూ

ఒక దశలో నజీబ్ కు మనిషి మీద మానవత్వం మీద నమ్మకం పోయి తాను కాపాడుకుంటున్న గొర్రెల్లో తానూ ఒక గొర్రెగానే భావించుకుంటాడు. 8 నెలల ప్రెగ్నెంట్ భార్యను వదిలి విదేశీ ఉద్యోగానికి బయలు దేరిన నజీబ్ కు తనకు పుట్టిన బిడ్డ ఎలా ఉందో తెలియదు. వారి జ్ఞాపకాలతో ఊరట చెందుతూ ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తాడు. అలా కొన్నేళ్ల నరకయాతన తర్వాత చివరకు తన కుటుంబానికి చేరువవుతాడు. నజీబ్ సాగించిన ఈ సాహసోపేత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తికరంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నజీబ్ జీవితంలోని ఈ భావోద్వేగాలన్నీ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాలో అత్యంత సహజంగా చిత్రీకరించారు మేకర్స్. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఆయన భార్య పాత్రలో అమలాపాల్ నటించగా హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్ కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.