NTV Telugu Site icon

Meera Jasmine: తండ్రికి గుడ్ బై చెప్పిన మీరా జాస్మిన్.. ఎమోషనల్ పోస్ట్

Meera Jasmine Post

Meera Jasmine Post

Meera Jasmine Remembers Her Father Joseph Philip in instagram post: నటి మీరా జాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిప్ గురువారం కన్నుమూశారు. ఆయనకు 83 ఏళ్లు. వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురై ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. చాలా ఏళ్లుగా ముంబైలోనే ఉంటున్న ఆయన చివరి రోజుల్లో కొచ్చికి వచ్చారు. జోసెఫ్ ఫిలిప్ భార్య ఎడత్వ కడమత్ ఏలియమ్మ జోసెఫ్. మీరా జాస్మిన్‌తో పాటు, ఆమెకు జోమోన్, జెన్నీ సుసాన్, సారా రాబిన్ మరియు జార్జి జోసెఫ్ పిల్లలు ఉన్నారు. రంజిత్ జోస్, డా. మరియు రాబిన్ జార్జ్ ఆయనకు మేనల్లుళ్ళు. ఇక తాజాగా సోషల్ మీరా జాస్మిన్ తన తండ్రి జ్ఞాపకాలను పంచుకుంది. మీరా తన తండ్రితో ఉన్న కుటుంబ చిత్రాన్ని, తన తండ్రి పాత ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’ని టెలికాస్ట్ చేయొద్దు.. దూరదర్శన్‌ని కోరిన కేరళ సీఎం..

ఆ ఫొటోలతో పాటు ‘మళ్లీ కలిసే వరకు’ అనే క్యాప్షన్‌ను కూడా ఆమె రాసుకొచ్చింది. ఇక మీరా జాస్మిన్ షేర్ చేసిన పోస్ట్ కింద చాలా మంది తమ సంతాప సందేశాలను రాసుకొచ్చారు. ఇక మీరా జాస్మిన్ మాత్రమే కాదు ఆమె కుటుంబంలో చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన వారే. మీరా సోదరి జెనీ సారా జోసెఫ్ స్కూల్ బస్ సినిమాలో నటించింది. మీరా బ్రదర్ జార్జ్ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్నాకులం కడవంతరలోని వికాస్ నగర్‌లో దైవ సేవల అనంతరం ఆదివారం సాయంత్రం 4 గంటలకు పాతనంతిట్టలోని ఇలంతూరు మర్థోమా వలియపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారని వెల్లడించారు.