హీరోయిన్స్ గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు కొందరు తారలు. అయితే ఆ పేరును ఎక్కువ రోజులు నిలబెట్టుకోవాలి… ఎక్కువ సినిమాలు చెయ్యాలంటే యాక్టింగ్ స్కిల్స్, అదృష్టం తోడవటంతో పాటు గ్లామర్ షో కూడా తెలిసి ఉండాలి. ఏ క్యారెక్టర్ కి ఎలా మౌల్డ్ అవ్వాలి… ఏ సీన్ కోసం ఎంత నటించాలి అనేది లెక్కలు వేసుకుంటారు కానీ ఏపాత్రకి ఎంత గ్లామర్ గా కనిపించాలి? ఎలాంటి లుక్ లో కనిపించాలి? అనే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోరు. అలా జాగ్రత్తలు తీసుకున్న వారు ఎక్కువ కాలం కెరీర్ కొనసాగిస్తారు.
అలా అని కేవలం స్కిన్ షోతోనే స్టార్ హీరోయిన్ అయిపోలేరు. ముందు చెప్పినట్లు యాక్టింగ్ టాలెంట్ తో పాటు పిసరంత అదృష్టం కూడా ఉండాలి. సింపుల్ గా చెప్పాలి అంటే యాక్టింగ్ అండ్ గ్లామర్ బాలన్స్ చేసుకుంటే ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాల కెరీర్ ఉంటుంది. లేదంటే
ఎంత టాలెంట్ ఉన్నా లైమ్ లైట్ లో ఉండడం కష్టం. ఈ విషయాన్ని మీరా జాస్మిన్ వంటి వాళ్లని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డ్ అందుకున్న యాక్టింగ్ టాలెంట్ ఉన్న ఈ మలయాళ బ్యూటీ తెలుగులో ‘అమ్మాయి బాగుంది’ సినిమాతో ఎంట్రీ
ఇచ్చింది. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోస్ పక్కన కూడా నటించింది. హోమ్లీ ఇమేజ్ తెచ్చుకున్న మీరా జాస్మిన్ అక్కడే ఆగిపోయింది.
తనకి మొదటి సినిమాతో వచ్చిన హోమ్లీ ఇమేజ్ నిలబెట్టుకునే ప్రాసెస్ లో పెద్ద హీరోల సినిమాలు మిస్ అయ్యింది. యాక్టింగ్ తో పాటు గ్లామర్ షో కూడా ఉండాలనే విషయం మీరా జాస్మిన్ మర్చిపోయింది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. గత పదేళ్లలో మీరా జాస్మిన్ ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు అంటే ఈ మలయాళ బ్యూటీ కెరీర్ ఎలా అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మళ్లీ సినిమాలపై మోజు పెరిగిందో లేక తన కెరీర్ ఎందుకు ఇలా అయ్యిందో అని ఆలోచించుకున్నదో తెలియదు కానీ మీరా జాస్మిన్ తన యాక్టింగ్ టాలెంట్ కి గ్లామర్ షో కూడా యాడ్ చేసి సోషల్ మీడియాలో హీటు పెంచుతోంది. హాట్ ఫోటోస్, క్లివేజ్ షో చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ వస్తోంది. నలబై ఏళ్ళు వచ్చిన తర్వాత మీరా జాస్మిన్ చేసేదేదో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా చేసి ఉంటే అప్పట్లోనే స్టార్ హీరోయిన్ అయి ఉండేది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఏర్పడిన ప్రస్తుత తరుణంలో మీరా జాస్మిన్ ఫోటోస్ చూసైనా వీర సింహా రెడ్డిలో ‘హానీ రోజ్’ని తెచ్చినట్లు మీరా జాస్మిన్ ని మన దర్శకనిర్మాతలు మళ్లీ బిజీ చేస్తారేమో చూద్దాం.