Site icon NTV Telugu

Meenakshi Chaudhary : నాకు ఏజ్‌తో ప్రాబ్లం లేదు.. ఎవరైనా ఓకే

Meenakshi

Meenakshi

టాలీవుడ్‌లో ఒక్కో స్టార్‌ హీరోయిన్‌ కెరీర్‌ అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది. కొన్నిసార్లు స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయి. కానీ అవి ఆశించినంతగా హిట్‌ కాకపోతే, హీరోల కంటే హీరోయిన్‌నే బాధ్యురాలిగా తేలుస్తారు. అలాంటి అనుభవం పంచుకుంది అందాల భామ మీనాక్షి చౌదరి.

Also Read : Andhra King Taluka : ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’ టైటిల్ ప్రోమో రిలీజ్.. ఎనర్జీతో మెప్పించిన రామ్‌

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి, అడివి శేష్‌తో కలిసి చేసిన హిట్‌ 2 సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్‌ దూసుకుపోయింది. వరుసగా గుంటూరు కారంలో మహేష్‌ బాబుతో, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి వరుస సక్సెస్‌లు దక్కించుకుంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మీనాక్షి తన సినీ ప్రయాణం గురించి బహిరంగంగా మాట్లాడింది. “నటిగా ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలి, అప్పుడు మాత్రమే మన నటనకు విలువ తెలుస్తుంది. కానీ ఇకపై పిల్లల తల్లిగా కనిపించే రోల్స్‌ మాత్రం చేయను. లక్కీ భాస్కర్లో ఆ పాత్ర కథ నచ్చి చేశాను, కానీ ఇకపై అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా ‘నో’ చెబుతా. పెద్ద హీరోలతో కలిసి సినిమాలు చేయడానికే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలా చేసే అవకాశం వస్తే దాన్ని కొత్త జానర్‌గా తీసుకుంటాను” అని స్పష్టంగా తెలిపింది.

అలాగే, “వెంకటేశ్‌ గారితో కలిసి చేసిన సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్‌ను చాలా ఎంజాయ్‌ చేశా. చిరంజీవిగారితో చేస్తున్న విశ్వంభర సినిమా నా కెరీర్‌లో స్పెషల్‌ ఛాప్టర్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది” అంది మీనాక్షి. అలాగే రూమర్స్‌ గురించి మాట్లాడుతూ – “నా గురించి ఏదైనా చెప్పాలంటే నేను స్వయంగా చెబుతా. నాకూ సోషల్‌ మీడియా ఉంది కాబట్టి, ఇతరులు రూమర్స్‌ సృష్టించాల్సిన అవసరం లేదు” అని చెప్పింది.

Exit mobile version