NTV Telugu Site icon

Meenakshi Chaudhary: స్టార్‌ కమెడియన్‌ హీరోతో జతకట్టబోతున్న మీనాక్షి చౌదరి..!

Sm

Sm

Meenakshi Chaudhary is going to team up with the star comedian hero: యంగ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. చిన్న సినిమాలతో కెరీర్‌ను మొదలు పెట్టి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోల సరసన నటిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నది. సుశాంత్‌ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కిలాడి, హిట్‌ సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనే నటించింది. ఇప్పటికే తమిళ స్టార్‌ హీరో విజయ్‌ దళపతి చిత్రం ” ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌”, ఇంకో పక్క దుల్కర్ సల్మాన్ “లక్కీ భాస్కర్ ” చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నది.

Also Read: Renuka Swamy: రేణుకా స్వామి నాకు కూడా అసభ్యకరమైన మెసేజులు పంపాడు.. మరో కన్నడ నటి సంచలనం!

తాజాగా మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. తమిళ స్టార్‌ కమెడియన్‌ సంతానం చిత్రంలో ఫీమేల్‌ లీడ్‌గా కనిపించనున్నది. సంతానం హీరోగా చేస్తున్న “దిల్లుకు దుడ్డు-3” మూవీలో హీరోయిన్‌గా మీనాక్షిని తీసుకున్నారని టాక్‌. సినిమాను కోలీవుడ్ హీరో ఆర్య నిర్మిస్తుండగా ప్రేమానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ పక్క స్టార్ హీరోతో నటిస్తూనే.. మీనాక్షి తర్వాత కమెడియన్‌ సరసన నటించడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. హీరో ఎవరైనా పాత్ర నచ్చితే చేస్తుంటారు. మీనాక్షి సైతం అదే బాటలో వెళ్తున్నది. హీరో కమెడియన్‌ సంతానం అని చూడకుండా తనకు పాత్ర నచ్చడంతోనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

ఇదిలా ఉండగా.. మీనాక్షి ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్నది. తెలుగులో వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘మట్కా’ చిత్రంలో నటిస్తున్నది. దూల్కర్‌ సల్మాన్‌ హీరోగా వస్తున్న ‘లక్కీ భాస్కర్‌’తో చిత్రంతో పాటు విశ్వక్‌సేన్‌ హీరోగా తెరకెక్కనున్న మరో చిత్రంలోనూ హీరోయిన్ నటించనున్నది. అలాగే, మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంబర’తో పాటు తమిళస్టార్‌ హీరో విజయ్‌తో గోట్‌ మూవీలో జతకట్టబోతున్నది. మరో వైపు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో తన అందమైన ఫొటోషూట్స్‌తో ఎప్పటికపుడు అలరిస్తుంది.

Show comments