Site icon NTV Telugu

Meenakshi Chaudhary: నక్కతోక తొక్కావా ఏంది? అప్పుడే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టావ్?

Meenakshi-Chaudhary

Meenakshi Chaudhary roped in for Dulquer Salmaan’s Lucky Baskhar: ‘ఇచ్చట వాహనమలు నిలపరాదు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ‘హిట్‌-2’తో సూపర్‌ హిట్‌ అందుకొంది హిందీ భామ మీనాక్షి చౌదరి. ఏకంగా ‘గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకున్న ఆమె ఇప్పటికే కొన్ని షెడ్యూల్‌స్ కూడా పూర్తి చేసింది. ఇక మీనాక్షి చౌదరి మెల్లగా భారీ ప్రాజెక్ట్‌లను సొంతం చేసుకుంటోంది . మహేష్ బాబుతో “గుంటూరు కారం” సినిమా లాంటి ప్రాజెక్ట్ లో భాగమైన ఆమె మరో పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ కోసం సంతకం చేసింది. మీనాక్షి చౌదరి ఈ పాన్ ఇండియా సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా నటిస్తుంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న “లక్కీ బాస్కర్” అనే పాన్ ఇండియన్ ప్రాజెక్టులో ఆమె దుల్కర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

Tollywood Producer: టాలీవుడ్ లో మళ్ళీ డ్రగ్స్ కలకలం.. మరో సినీ నిర్మాత అరెస్ట్?

ఇక ఈ ప్రాజెక్ట్ కొంతకాలం క్రితం ప్రకటించగా ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ‘ఏజెంట్’ భామ సాక్షి వైద్యను మొదట హీరోయిన్ గా అనుకున్నా కానీ నిర్మాతలు చివరికి మీనాక్షి చౌదరిని ఫిక్స్ చేశారు. ఇక గతంలో కెరీర్‌ తొలినాళ్లలోనే మంచి సినిమాల్లో అవకాశాలు రావడం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం చాలా కథలు వింటున్నానని, కథల ఎంపికలో జాగ్రత్త తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. బిజీగా ఉండడం కోసం కాకుండా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలని, ఏదైనా సీన్ నాకు అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని ముందుగానే అంగీకరించనని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా ఎన్నో సినిమాలు తిరస్కరించా, కథకు అవసరమైతేనే ముద్దు సన్నివేశాల్లో నటించాలని నియమం పెట్టుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది.

Exit mobile version