Meena- Sanghavi: విక్టరీ వెంకటేష్ డబుల్ రోల్ చేసిన సూర్యవంశం సినిమా గుర్తుందా..? హా.. అదేంటి అంత మాట అనేశావ్.. ఆ సినిమాను ఎవరైనా మర్చిపోగలరా..? అంటారా…? నిజమే మరి అప్పట్లో వెంకటేష్ సినిమాలు అంటే ఫ్యామిలీ డ్రామాలు, హిట్లు.. సూర్యవంశం సినిమా అన్ని భాషల్లో రీమేక్ అయ్యి హిట్ కొట్టిన చరిత్ర మరి. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనా నటించగా.. అతిధి పాత్రలో సంఘవి కనిపించింది. రోజావే చిన్ని రోజావే సాంగ్ తో సంఘవి ఎంతో మంచి గుర్తింపును అందుకోగా.. మీనా, సంఘవి మధ్య వచ్చే సీన్స్ అయితే ఇప్పటికీ ఎవరో ఒకరు యూట్యూబ్ లో చూస్తూనే ఉంటారు. ఆ సినిమా నుంచి మీనా, సంఘవి మంచి స్నేహితులు. ఇండస్ట్రీలో మీనాకు ఉన్న స్నేహితుల్లో సంఘవి ఒకరు.
Akkineni Nagarjuna: ముందు ఇల్లాలు.. వెనుక ప్రియరాలు మధ్యలో మన్మథుడు
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మలు రీ ఎంట్రీలతో బిజీగా మారిన సంగతి కూడా తెలుసు. ఇక గతేడాది మీనా తన భర్త సాగర్ ను పోగొట్టుకున్న విషయం కూడా విదితమే. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకొని బయటికి వస్తుంది. సినిమాలు, షూటింగ్స్ అంటూ తిరుగుతూ మధ్య మధ్యలో సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గర అవుతోంది. ఇక తాజాగా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి సోషల్ మీడియా ట్రెండింగ్ సాంగ్ తమ్ తమ్ సాంగ్ కు చిందేశారు. ప్రస్తుతం ఈ రీల్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు అప్పటికి, ఇప్పటికి ముఖంలో మార్పులొచ్చినా హావభావాల్లో ఇద్దరు పోటీపడుతూనే ఉన్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.