Meena Sagar: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆ సమయంలో హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని.. ఎంతోమంది అభిమానులను తన అందంతో పడేసింది. ఇక పెళ్లి తరువాత కొంత గ్యాప్ ఇచ్చిన మీనా.. బిడ్డ పుట్టాకా రీఎంట్రీ ఇచ్చింది. అన్ని భాషల్లో ఆమె తన సత్తా చూపుతుంది. ఇక గతేడాది మీనా.. తన భర్త సాగర్ ను కోల్పోయిన విషయం తెల్సిందే. మీనాకు ఒక కూతురు. ఆమె కూడా బాలనటిగా మంచి పేరు తెచ్చుకుంటుంది. కూతురు కోసమైనా మీనా సంపాదించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనా.. చాలా గ్యాప్ తరువాత ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి.. అప్పట్లో సినిమా వాతావరణం ఎలా ఉండేది అని చెప్పుకొచ్చింది.
“ఇప్పుడున్నట్లు మేము నటించే సమయంలో అన్నిరకాల వసతులు ఉండేవి కావు. ఇప్పుడు ఇండస్ట్రీ మారింది. అప్పట్లో హీరోయిన్ల పాత్రలకు ఇంపార్టెన్స్ ఉండేది.. యాక్టింగ్ కు స్కోప్ కూడా ఉండేది. ఇక అప్పట్లో రైటర్స్ నన్ను ఊహించుకుని పాత్రలను రాయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక గ్లామర్ రోల్స్ కూడా నేను చేశాను. కానీ ఎక్కడా వల్గర్ గా అనిపించనివి.. నాకు కంఫర్ట్ గా అనిపించేవి చేశాను. ఇప్పుడే కాదు అప్పుడు కూడా గ్లామర్ రోల్స్ చేసే హీరోయిన్లపై ఎక్కువ ఫోకస్ ఉండేది. వారిని చూసి నేను కూడా అలాగే చేయాలనుకొనేదాన్ని. ఇక ఆ సమయంలో నాతో పాటు.. రమ్యకృష్ణ, రోజా, రంభ స్టార్ హీరోయిన్లుగా కొనసాగారు. మిగతావారికి, నాకు ఎప్పుడు పోటీ రాలేదు కానీ, రోజాకు నాకు మాత్రం పోటీ గట్టిగా నడిచేది. డేట్స్ కారణంగా నేను వదులుకున్న సినిమాలు ఆమెకు.. ఆమె వదులుకున్న సినిమాలు నాకు వచ్చేవి. ఇప్పటికీ నా తోటి హీరోయిన్స్ తో నేను టచ్ లోనే ఉంటాను. ఏ కష్టమొచ్చినా వారు అండగా ఉంటారు” అని చెప్పుకొచ్చింది.
