Meena: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఉండేవారికి ఎన్ని ప్రశంసలు దక్కుతాయో.. అంతకు మించిన విమర్శలు కూడా ఉంటాయి. ముఖ్యంగా రూమర్స్ విషయంలో సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఒక హీరో, హీరోయిన్ కలిసి కనిపిస్తే ప్రేమ అని, పెళ్లి అని చెప్పుకొచ్చేస్తున్నారు. భర్త చనిపోయిన వెంటనే హీరోయిన్ కు రెండో పెళ్లి అని ట్రోల్స్ చేస్తున్నారు. ఆ హీరో తో ఎఫైర్ ఉందని, ఈ హీరోయిన్ తో తిరుగుతున్నాడని ఇలా రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే అలంటి రూమర్స్ వలన తమ కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అని అంటుంది సీనియర్ నటి మీనా. బాలనటిగా కెరీర్ ను ప్రారంభించిన మీనా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక గతేడాది మీనా తన భర్త సాగర్ ను కోల్పోయింది. లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం ఆలస్యం అవ్వడంతో సాగా మృతి చెందాడు. ఇక అతను మరణించిన మూడు నెలలకే మీనా రెండో పెళ్లి చేసుకుంటుందని పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాకుండా హీరో ధనుష్ ను మీనా రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ పుకార్లపై మీనా స్పందించింది. “నాకు, హీరో ధనుష్ కు లింక్ చేశారు. అతడిని రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అతనితోనే కాకుండా చాలామందితో సంబంధం అంటగట్టారు. అవన్నీ చదివి నా ఫ్యామిలీ ఎంత బాధపడుతుందనేది కూడా ఆలోచించట్లేదు.. ఒకానొక సమయంలో వారిపై నాకు చాలా కోపం వచ్చింది. మీడియా ముందుకు రావడానికి కూడా నేను ఇష్టపడలేదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందనేది నేను ఊహించలేను. ఇప్పట్లో మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాత్రం అస్సలు లేదు. అలా అని జీవితాంతం ఒంటరిగా ఉంటానని చెప్పలేను. ఏం జరుగుతుందో చూడాలి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
