Meena: టాలీవుడ్ సీనియర్ నటి మీనా సాగర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇటీవలే భర్తను కోల్పోయిన మీనా.. ఆ బాధను మర్చిపోవడానికి వెంటనే షూటింగ్స్ లో పాల్గొంటుంది. తెలుగు,తమిళ్ ,మలయాళం అని తేడా లేకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొంటుంది. ఇక రెండు రోజుల నుంచి మీనా రెండో పెళ్లి చేసుకొంటుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒంటరిగా ఉండకూడదని మీనా తల్లిదండ్రులు తమ బంధువుల్లోనే ఒక వ్యక్తితో సంబంధం మాట్లాడారని, మీనా కుడా ఓకే అనడంతో త్వరలోనే మీనా పెళ్లి చేసుకొంటుందని వార్తలు గుప్పుమన్నాయి. ఇక తాజాగా ఈ వార్తలపై మీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ వార్తలను ఖండించింది.
“బుద్ధి ఉందా.. డబ్బు కోసం ఏదైనా చేస్తారా..? ఎవరు చెప్పారు నేను రెండో పెళ్లి చేసుకుంటున్నానని.. సోషల్ మీడియా రోజురోజుకు దిగజారిపోతోంది. నిజనిజాలు తెలుసుకొని రాయండి.. దిగజారి ప్రవర్తించకండి.. నా భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎన్నో తప్పుడు ప్రచారాలు వచ్చాయి..అవి ఇప్పటికి ఆగలేదు..ఇలాంటి వార్తలు పుట్టించే వారిపై కచ్చితంగా చర్యలు తీసుకునేలా చేస్తాను” అంటూ నిప్పులు చెరిగింది. దీంతో రెండో పెళ్లి వార్తలు నిజం కాదని అర్ధమవుతోంది. అయితే మీనా ఎప్పుడు ఇంత కోప్పడింది లేదని, ఈ వార్తలు ఎంత బాధపెట్టి ఉంటే ఆమె ఇంతలా వార్నింగ్ ఇస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.