Meena Birthday Special : వైవిధ్యంగా సాగిన మీనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలనటిగానే భళా అనిపించి, ముగ్ధమనోహర రూపంతో నాయికగా అలరించి, అబినయంతోనూ ఆకట్టుకొని చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు మీనా. అందాల అభినేత్రిగా మీనా జనం మదిలో చెరగని ముద్ర వేశారు. అనేకమంది టాప్ స్టార్స్ తో బాలనటిగానూ, నాయికగానూ నటించి మరో శ్రీదేవి అన్న పేరు కూడా సంపాదించారు. దక్షిణాది భాషలన్నిటా మీనా అభినయం ఆకట్టుకుంది. కొన్ని హిందీ చిత్రాలలోనూ మీనా మెరిసింది. ఇప్పటికీ తన వద్దకు వచ్చిన పాత్రల్లో నచ్చినవాటిని అంగీకరిస్తున్నారు.
మీనా 1976 సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించారు. శివాజీ గణేశన్ నటించిన `నెంజన్ గళ్` చిత్రంలో తొలిసారి మీనా తెరపై కనిపించారు. తెలుగులో మీనా మొదటిసారి కనిపించిన చిత్రం కృష్ణ హీరోగా రూపొందిన `సిరిపురం మొనగాడు`. ఈ చిత్రం తరువాత “ఇల్లాలు-ప్రియురాలు, కోడెత్రాచు, బావామరదళ్ళు, సూర్యచంద్ర, రెండు రెళ్లు ఆరు, సిరివెన్నెల“ సినిమాల్లో బాలనటిగా భలేగా నటించి అలరించారు. మోహన్ గాంధీ దర్శకత్వంలో విజయశాంతి నాయికగా తెరకెక్కిన `కర్తవ్యం`లో లేలేత అందాలతో ఓ కీలక పాత్ర పోషించారు. ఏయన్నార్ ముఖ్యపాత్ర పోషించిన `సీతారామయ్యగారి మనవరాలు`లో ఆ మహానటునితో పోటీగా నటించి మంచిపేరు సంపాదించారు. ఆయనతో కలసి నటించిన `రాజేశ్వరి కళ్యాణం`తో ఉత్తమనటిగా నందినీ సొంతం చేసుకున్నారు మీనా. `అన్బుల్ల రజనీ`లో రజనీకాంత్ తో బాలనటిగా నటించిన మీనా, తరువాత ఆయనతోనే `ముత్తు` చిత్రంలో నాయికగా మెరిసి మురిపించారు. అలాగే కృష్ణతోనూ `ఇంద్రభవనం`లో నాయికగా నటించారు. ఆ సమయంలోనే మీనాను మరో శ్రీదేవిగా కొందరు కీర్తించారు.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
టాలీవుడ్ టాప్ స్టార్స్ తో విజయకేతనం ఎగురవేశారు మీనా. చిరంజీవితో `ముఠామేస్త్రి, స్నేహం కోసం`, బాలకృష్ణతో `బొబ్బిలిసింహం`, `క్రిష్ణబాబు`, నాగార్జునతో `ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు`, మోహన్ బాబుతో `అల్లరి మొగుడు` వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు మీనా. తెలుగునాట ఆమె హిట్ పెయిర్ వెంకటేశ్ అనే చెప్పాలి. వారిద్దరూ కలసి నటించిన “చంటి, అబ్బాయిగారు, సుందరకాండ, సూర్యవంశం, దృశ్యం, దృశ్యం-2“ చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. ఇక “అల్లరి పిల్ల, గిల్లికజ్జాలు, పెళ్ళాం చెబితే వినాలి, భలే పెళ్ళాం, చిలకపచ్చ కాపురం, మా అన్నయ్య, పాపే నా ప్రాణం, అమ్మాయి కోసం, పుట్టింటికి రా చెల్లీ, స్వామి, వెంగమాంబ“ వంటి చిత్రాలలోనూ మీనా అభినయం జనాన్ని ఆకట్టుకుంది.
మీనా బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను 2009లో వివాహం చేసుకున్నారు. వారికి నైనిక అనే అమ్మాయి ఉంది. ఐదేళ్ళ ప్రాయంలోనే నైనిక `తేరి`అనే చిత్రంలో నటించింది. మీనా కొన్ని టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ యేడాది జూన్ 28న విద్యాసాగర్ శ్వాసకోశ సంబంధ వ్యాధితో హఠాన్మరణం చెందారు.
ఇప్పటికీ మీనా అనగానే చాలామందికి ముద్దు ముద్దు మాటలతో బొద్దుగా అలరించిన బాలతార మీనా గుర్తుకు వస్తుంది. పరువాల ప్రాయాన `సీతారామయ్యగారి మనవరాలు`గానూ స్ఫురిస్తుంది. `చంటి` ప్రియురాలుగా చేసిన నటన కూడా మదిలో మెదలక మానదు. తరువాతి రోజుల్లో శ్రీవేంకటేశ్వరుని భక్తురాలు వెంగమాంబగా అలరించిన వైనమూ మన జ్ఞాపకాల్లో కదలాడుతుంది.
తాజావార్తలు
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
-
Pawan Kalyan : పవన్ ఫోకస్‌తో పెదపెంకికి కొత్త జీవం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!