NTV Telugu Site icon

Medicover Hospital : మూత్రపిండ వ్యాధిపై మెడికవర్ హాస్పిటల్స్ అవగాహన.. బైక్ ర్యాలీ

Medicover Hospital

Medicover Hospital

Medicover Hospital : వరల్డ్ కిడ్నీ డే పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ & హార్లే డేవిడ్‌సన్ బైకర్స్ కలిసి కిడ్నీ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ మేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ACP సత్యనారాయణ వచ్చి జెండా ఊపి రైడ్ ను ప్రారంభించారు. సత్యనారాయణ మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్, హార్లే ఓనర్స్ గ్రూప్, బంజారా చాప్టర్ సభ్యులు కిడ్నీ వ్యాధులపై అవగాహన కలిగించడంకి అభినందించాల్సిన విషయం అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు కన్నా ఆరోగ్యం ఎంతో విలువైనది అని అన్నారు.

Read Also : Nithin : మహేశ్, పవన్ నుంచి అవి దొంగిలిస్తా.. నితిన్ షాకింగ్ కామెంట్స్

ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ నెఫ్రాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ కమల్ కిరణ్ మాట్లాడుతూ చాలా మందికి కాళ్లలో వాపు, నిరంతర అలసట చిన్న సమస్యలుగా కనిపిస్తాయి కానీ అది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి దారి తీస్తుందన్నారు. అనేక మంది ప్రజలకు ముందస్తు లక్షణాలు లేకపోవడం, మధుమేహం లేకపాయినా మూత్రపిండాలు పని చేయడం ఆగిపోవడం సాధారణంగా కనిపిస్తోందన్నారు. ముందస్తు పరీక్షలు చేయించుకుని, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.

మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ “మన శరీరంలో రక్తంలో నిరంతరం ఎన్నో వ్యర్థాలు, విషతుల్యాలను కిడ్నీలు ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ అవి ఎప్పటికప్పుడు బయటకు పోతేనే శరీరం ఆరోగ్యంగా మరియు మనం బ్రతకగలం అన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ అఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ వరల్డ్ కిడ్నీ డే అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజారోగ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ రైడ్ కిడ్నీ ఆరోగ్యంపై ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి నియోపోలీస్ మూవీ టవర్స్ మీదుగా క్రిమ కేఫ్ మోకిల, అక్కడ నుంచి తిరిగి మెడికవర్ హాస్పిటల్స్ వరకు నిర్వహించారు.