మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5 స్పీడ్ పెరిగింది, ఇప్పటికే ఫెబ్ లో ‘యాంట్ మాన్ అండ్ ది వాస్ప్-క్వాంటుమేనియా’ సినిమాతో ఫేజ్ 5 స్టార్ట్ అయ్యింది. ఈ మూవీ ఆశించిన రేంజులో ఆడలేదు కానీ మే 5న రిలీజ్ అయిన ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ సినిమా మాత్రం కాస్త పర్వాలేదనిపించింది. భారి హిట్ కాలేదు కానీ ఓ మోస్తరు కలెక్షన్స్ ని రాబట్టింది. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’ సినిమా రిలీజ్ తర్వాత ఆరు నెలలకి ఫేజ్ 5లో రానున్న లేటెస్ట్ మూవీ ‘ది మార్వెల్స్’. దీపావళి కానుకగా నవంబర్ 10న ‘ది మార్వెల్స్’ సినిమా రిలీజ్ కానుంది. యాక్షన్, ఫన్, అడ్వెంచర్ కలిసిన ఈ మూవీలో ‘కెప్టెన్ మార్వెల్’, ‘కమలా ఖాన్’, ‘మోనికా’ క్యారెక్టర్స్ కలిసి కనిపించనున్నాయి. ఈ ముగ్గురిని టీం అప్ చేసే క్యారెక్టర్ లో ‘నిక్ ఫ్యూరి’ పాత్రలో సామ్యూల్ జాక్సన్ నటిస్తున్నాడు.
Captain Marvel, Monica Rambeau, and Ms. Marvel are back.
See their cosmic team-up in #TheMarvels, only in theaters November 10. pic.twitter.com/XkYEpK5TtK
— Marvel Entertainment (@Marvel) July 21, 2023
అవెంజర్స్ అంటేనే టీం గేమ్, అలాంటిది మొదటిసారి ఉమెన్ పవర్ చూపిస్తూ ఈ సూపర్ హీరోస్ కలిసి నటించడంతో ‘ది మార్వెల్స్’ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీకొత్త ట్రైలర్ ని మార్వెల్ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ట్రైలర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకూ ఫన్, యాటిట్యూడ్, ఫ్రెండ్షిప్, అడ్వెంచర్, గ్రాండ్ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మార్వెల్ నుంచి వచ్చిన ఒక ట్రైలర్ కి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఇదే మొదటిసారి. మరి ఈ మూవీతో ఫేజ్-5కి జోష్ వస్తుందేమో చూడాలి. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ MCUకి పూర్వ వైభవం తీసుకోని రాలేకపోతున్నాయి. ఏ సూపర్ హీరో సినిమా ఆ మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
