NTV Telugu Site icon

KBC: కేబీసీలో కోటి గెలిచిన 12 ఏళ్ళ కుర్రాడు.. కోటి రూపాయల ప్రశ్న ఏంటంటే?

Kbc Mayank

Kbc Mayank

Mayank is the youngest crorepati of Kaun Banega Crorepati: టెలివిజన్ రంగంలో చరిత్ర సృష్టించిన రియాలిటీ గేమ్ షోస్ లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కూడా ఒకటి. అమితాబ్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అంటే 2000 సంవత్సరంలో మొదలైన ఈ క్విజ్ షోకి 22 ఏళ్లుగా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్న అమితాబ్ బుల్లితెరపై కనిపించడంతో అప్పట్లో నార్త్ జనం ఈ ప్రోగ్రాంకి బాగా అలవాటు పడ్డారు. ఇక ఈ షో విజ్ఞానానికి సంబంధించింది కావడంతో చిన్నా, పెద్ద అందరూ కలిసి చూడటానికి అలవాటు పడ్డారు. ఇక ఎన్నో వేలమందిని కలిసేలా చేసి ఈ ప్రోగ్రామ్ అమితాబ్ కెరీర్ ని మరింత ఉన్నతంగా మలవగా చాలా మంది సామన్యుల జీవితాలను సైతం మార్చింది. ప్రస్తుతం కేబీసీ సీజన్ 15 లో ‘కేబీసీ జూనియర్స్ వీక్’ నడుస్తున్న క్రమంలో తొలిసారిగా 12 ఏళ్ల కుర్రాడు కోటి గెలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

Manoj Manchu: రాంప్ ఆడిస్తానంటున్న మంచు మనోజ్.. గేమ్ షోతో వచ్చేస్తున్నాడు

కేబీసీ జూనియర్స్ వీక్ లో భాగంగా జరిగిన చివరి ఎపిసోడ్ లో హర్యానాకు చెందిన మాయంక్ హాట్ సీట్ కు చేరుకోగా 12 ఏళ్ల వయసులో ఈ కుర్రాడు అమితాబ్ అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెబుతూ ఔరా అనిపించాడు. నిజానికి అమితాబచ్చన్.. మయాంక్ ని కోటి రూపాయల ప్రశ్న అడగగా దానికి మయాంక్ కరెక్ట్ సమాధానం చెప్పలేడు అని అందరూ అనుకున్నారు. అయితే మయాంక్ కాస్త సమయం తీసుకొని పాలిటిక్స్ పై పట్టు ఉన్న ఓ వ్యక్తి సహాయం తీసుకుని సమాధానం చెప్పాడు. కొత్త ఖండానికి అమెరికా అని పేరు పెట్టిన యురోపియన్ కార్టో గ్రాఫర్ ఎవరు? అని ప్రశ్నించగా మార్టిన్ వాల్డ్సీ ముల్లర్ అని సరైన సమాధానం చెప్పాడు. అలా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి ‘కేబీసీ జూనియర్స్ వీక్’ లో తొలిసారి కోటి గెల్చుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు మయాంక్. ఆ తర్వాత మయాంక్ ని రూ.7 కోట్ల ప్రశ్న అడగగా దానికి సరైన సమాధానం చెప్పలేక కోటి రూపాయలు బహుమతి అందుకుని వెనుదిరిగాడు.