NTV Telugu Site icon

Matti Kusthi Trailer: శోభనం అయ్యాక ప్రతి మగాడి జీవితం ఫసక్..

Matti Kusti

Matti Kusti

Matti Kusthi Trailer:కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా చెల్లా అయ్యువు దర్శకత్వం వహిస్తున్న చిత్రం మట్టి కుస్తీ. ఈ సినిమాతో మొదటిసారి మాస్ మహారాజ రవితేజ కోలీవుడ్ లో నిర్మాతగా అడుగుపెడుతున్నాడు. ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. నిత్యం గొడవలు.. కొట్లాటలో ఆరితేరిన హీరోకు పెళ్లి కాదు.. ప్రేమించడానికి ఏ అమ్మాయి ధైర్యం చేయదు. దీంతో హీరోకు ఎలాగైనా పెళ్లి చేయడానికి కష్టపడుతుంటాడు హీరో మావయ్య. అయితే తనకు కాబోయే భార్య తనముందు అణిగి మణిగి ఉండాలని కోరుకుంటాడు. కానీ దానికి పూర్తీ విరుద్ధంగా ఉన్న అమ్మాయిని పెళ్లాడతాడు.. హీరోయిన్ కుస్తీలో నైపుణ్యం ఉన్న అమ్మాయి అని తెలియక పెళ్లాడిన హీరోకు ఫస్ట్ నైట్ తరువాత నుంచి వారి మధ్య గొడవలు మొదలవుతాయి.

భార్య అంటే అణిగిమణిగి ఉండాలనుకునే యువకుడు.. భర్త ముందు తలవంచుకొని నిలబడాల్సిన అవసరం లేదనుకొనే యువతి మధ్య జరిగే కథ.. ఇక ఇందులో ట్విస్ట్ గా భార్య గొడవల నుంచి బయటికి వచ్చి హీరో మట్టి కుస్తీలో పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. చివరికి అతను అనుకున్నది జరిగిందా..? అతను గెలవడానికి భార్య ఏం చేసింది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంట కెమిస్ట్రీ అదిరిపోయింది. కథ మొత్తం న్యాచురల్ గా తీసినట్లు కనిపిస్తోంది. ఇక కామెడీ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్రా కుర్రాళ్ళు అమాయకులు, శోభనం అయ్యాక ప్రతి మగాడి జీవితం ఫసక్ అనే డైలాగ్ లు ఆకట్టుకొంటున్నాయి. ఇక జస్టిన్ ప్రభాకర్ సంగీతం చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది. మొత్తానికి ట్రైలర్ ను బట్టి రవితేజ నిర్మాతగా హిట్ అందుకునేలా ఉన్నాడని తెలుస్తోంది. డిసెంబర్ 2 న ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమా ఈ హీరోలకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.