NTV Telugu Site icon

Mathew Thomas : వరుస సినిమాలను లైన్లో పెడుతున్నమాధ్యూ థామస్

Mathew

Mathew

లియోలో ఇళయదళపతి విజయ్- త్రిషల కొడుకుగా గుర్తింపు దక్కించుకున్న మలయాళ యంగ్ యాక్టర్ మాథ్యూ థామస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. వాలంటైన్స్ మంత్‌ను టార్గెట్ చేస్తున్నాడు. వారం గ్యాప్‌లో టూ మూవీస్ దించేస్తున్నాడు. టీనేజ్‌లో హీరోగా మేకోవర్ అయ్యాడు మాథ్యూ థామస్. కుంబలంగి నైట్స్, తనీర్ మతన్ దీనంగల్‌తో మొదలైన జర్నీ సక్సెస్ ఫుల్‌గా కంటిన్యూ అవుతోంది. చేసిన ప్రాజెక్టులన్నీ హిట్స్ పడటంతో క్రేజీ బాయ్ గా ఛేంజయ్యాడు. క్యూరియస్ ప్రాజెక్టులన్నీఒడిసి పట్టేస్తున్నాడు.

Also Read : Venkatesh : దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలపై స్పందించిన వెంకటేశ్

లియో అతడి కెరీర్‌ను పీక్స్ తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఇందులో విజయ్- త్రిషల కొడుకు సిద్దు క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించాడు ఈ యంగ్ బాయ్. ప్రేమలుతో క్యామియో అప్పీరియన్స్‌తో సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిన మాథ్యూ లియోతో వెయిటేజ్ డబులయ్యింది. ప్రజెంట్ ఈ యంగ్ హీరో చేతిలో ఐదు ప్రాజెక్టులున్నాయి. వీటిల్లో రెండు సినిమాలను ఫిబ్రవరిలో తీసుకు వస్తున్నాడు. ధనుష్ మేనల్లుడిని ఇంట్రడ్యూస్ చేస్తోన్న(NEEK) నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబంలో మరో హీరోగా కనిపించబోతున్నాడు ఈ మలయాళ హీరో. ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా కప్, హారర్ మూవీ నైట్ రైడర్స్, లవ్లీ చిత్రాలతో కూడా 2025 డైరీ ఫుల్ ఫిల్ చేసుకుంటున్నాడు. లవ్లీ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. 3D ఫాంటసీ కామెడీ-డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఐదు సినిమాలను దించేస్తోన్న ఈ ఎనర్జటిక్ బాయ్‌ను చూస్తుంటే మిగిలిన యంగ్ హీరోలకు పోటీగా మారిపోయినట్టే కనిపిస్తోంది.