NTV Telugu Site icon

Lavanya – Raj Tarun: మస్తాన్ సాయి అరెస్ట్.. ఎందుకంటే?

Rajtarun

Rajtarun

Lavanya – Raj Tarun: రాజ్ తరుణ్ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసాడని ప్రియురాలుగా చెప్పుకునే లావ‌ణ్య‌ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనని పెళ్లి చేసుకోకుండా ఒక హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడని కూడా ఆరోపించింది. అయితే రాజ్ తరుణ్ లావణ్య చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. గతంలో కొన్నాళ్ళు లావణ్యతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను కానీ ఆమె వ్యవహారశైలి నచ్చక ఆమె నుంచి దూరంగా ఇంటి నుంచి బయటకు వచ్చేసానని అన్నారు. ఆమె డ్రగ్స్ వాడేది, మానేయమనీ ఎన్నిసార్లు చెప్పినా లావణ్య వినలేదన్న ఆయన మస్తాన్ సాయి అనే యువకుడితో లావణ్య రిలేషన్ లో ఉంది అని కూడా ఆరోపించాడు.

Also Read:Venu Swamy: నాగచైతన్య-శోభిత జాతకంను అందుకే చెప్పా.. ఇచ్చిన మాటపై నిలబెడుతా: వేణుస్వామి

గుంటూరుకు చెందిన మస్తాన్ సాయితో లావణ్యకు రిలేషన్ ఉందని రాజ్ తరుణ్ ఆరోపించినట్టుగానే కొన్ని ఆడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇదిలా అండగా ఇప్పుడు గుంటూరు జిల్లాలో మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. దర్గాలో ఉండగా మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న మస్తాన్ సాయినీ అదే కేసులో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో శేఖర్ బాషా అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపధ్యంలో శేఖర్ బాషా మీద లావణ్య దాడి చేయించడం, లావణ్య మీద శేఖర్ బాషా దాడి చేయడం చర్చనీయాంశం అయింది.

Show comments