Site icon NTV Telugu

Tiger Nageswara Rao: పులులని వేటాడే పులిని ఎప్పుడైనా చూసారా?

Tiger Nageswara Rao

Tiger Nageswara Rao

Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ మాస్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కథలు పైల్ అయ్యి ఉండొచ్చు కానీ, ఆయన నటన, ఎనర్జీ విషయంలో ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల సత్తా ఉన్న నటుడు రవితేజ. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రవితేజ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఐదు భాషల్లో ఐదుగురు స్టార్ హీరోలు రివీల్ చేయడమే కాకుండా ఫస్ట్ గ్లింప్స్ కు వాయిస్ కూడా అందించారు. తెలుగులో వెంకటేష్.. తమిళ్ కు కార్తీ, మలయాళం కు దుల్కర్ సల్మాన్, కన్నడకు శివ రాజ్ కుమార్, హిందీకి జాన్ అబ్రహం వాయిస్ లు అందించారు. వారి వాయిస్ తోనే టైగర్ నాగేశ్వరరావును పరిచయం చేశారు

టైటిల్ ఫస్ట్ లుక్ లో రవితేజ మాములుగా లేడు. “అది 70 వ దశకం.. బంగాళాఖాతం తీరప్రాంతంలోని ఒక చిన్న ప్రాంతం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడి జనాలను చూసి భయపడుతుంది.. దడదడ మంటూ వెళ్లే రైలు.. ఆ ప్రాంతం రాగానే గజగజ వణుకుతుంది. ఆ వూరు మైలురాయి కనపడితే.. జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశపు నేల రాజధాని ది క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా.. స్టూవర్టుపురం. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉంది టైగర్ జోన్. ది టైగర్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు” అని వెంకీ మామ బేస్ వాయిస్ తో నాగేశ్వరరావు ఇంట్రో చెప్పగానే.. పులి నుంచి రవితేజ రూపం గా మారిన ఫస్ట్ లుక్ రివీల్ అయ్యింది. ఇక ” జింకలను వేటాడిన పులిని చూసి ఉంటావ్. పులులను వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా..? ” అని రవితేజ పవర్ ఫుల్ వాయిస్ తో చెప్పే డైలాగ్ కే ప్రేక్షకులకు చెమటలుపడుతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు గా రవితేజ లుక్ అదరగొట్టింది. ఇక జీవీ ప్రకాష్ సంగీతం.. ఈ సినిమాకు హెలిటీ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇన్నిరోజులు ఆగినందుకు.. మేకర్స్ .. మంచి అప్డేట్ ను అందించడమే కాక.. ఒక్క ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. మరి ఈ సినిమా రవితేజకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

 

Exit mobile version