Raviteja: సోషల్ మీడియాని వణికిస్తున్న టైగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధమాకా, వాల్తేరు వీరయ్య జోష్‌లో వచ్చిన రవితేజ ‘రావణాసుర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టసింది. ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు దసరా బరిలో సై అంటున్నాడు మాస్ మహారాజా. ఫస్ట్ టైం రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఆధారంగా తెరెక్కుతున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయనున్నారు. దసరాకు బాక్సాఫీస్ దగ్గర వేట మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. అంతకంటే ముందే టీజర్‌తో డిజిటల్ వేటకు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఐదు భాషల్లో… ఐదుగురు స్టార్ హీరోలు రివీల్ చేయడమే కాకుండా ఫస్ట్ గ్లింప్స్ కు వాయిస్ కూడా అందించి, ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చారు.
టీజర్ తో టైగర్ నాగేశ్వర రావు సినిమాపై అంచనాలని మరింత పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం టైగర్ నాగేశ్వర రావు టీజర్ బయటకి రానుంది. దీంతో పులి బయటకి రానుంది, వేటకి సిద్ధమయ్యింది అంటూ మాస్ మహారాజా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. టీజర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో జోష్ పెరుగుతూ ఉంది. ఫస్ట్ లుక్ ఇచ్చిన ఇంపాక్ట్ లో 75% టైగర్ నాగేశ్వర రావు టీజర్ క్రియేట్ చేసినా చాలు, రవితేజ ఫ్యాన్స్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడి నుంచి అక్టోబర్ 20 వరకూ ప్రమోషన్స్ కి స్లో అవ్వకుండా చేసుకుంటూ పోతే చాలు తెలుగు రాష్ట్రాల్లో రవితేజ ఖాతాలో మరో కోట్ల సినిమా పడుతుంది. నార్త్ లో టైగర్ నాగేశ్వర రావుని ప్రమోట్ చేయడానికి అభిషేక్ అగర్వాల్ ఎలాగూ రెడీగా ఉన్నాడు. సో టీజర్ తో మాస్ మహారాజా పాన్ ఇండియా జాతర మొదలయినట్లే.
Also Read
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!