Raviteja: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు న్యాచురల్ స్టార్ నాని గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ” ఈ సినిమాకు నేను అందరు కొత్తవారితోనే పనిచేశాను. ఫైట్ మాస్టర్స్, సంగీతం, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ అంతా కొత్తవారే.. మొదటి సారి నేను వారితో వర్క్ చేస్తున్నాను. సినిమా అంతా బాగా వచ్చింది. వారితో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. హీరోయిన్లు దివ్యంకా కౌశిక్, రజిషా తో నటించడం బావుంది. సీసా సాంగ్ లో నటించిన అన్వేషి జైన్.. ఈ సినిమాలో ఈ సాంగ్ కు దుమ్ము లేచిపోతోంది. చాలా బాగా వచ్చింది సాంగ్. ఇకపొతే తమ్ముడు.. నాని.. థాంక్స్ నాని ఈవెంట్ కు వచ్చినందుకు.. నాని అంటే నాకు చాలా చాలా చాలా ఇష్టం.. పర్సనల్ గా , ప్రొఫెషనల్ గా కూడా. ఇందాక మ్యాషప్ లో నాని తెలుగు ఇండస్ట్రీలోనే అత్యుత్తమ నటుడు అని చెప్పారు .. కాదు నాని సౌత్ ఇండస్ట్రీలోనే అత్యుత్తమ నటుడు అతను.. నాని టైమింగ్.. చాలా సెన్సిబుల్ నటుడు. లవ్ యూ నాని.
ఇక వేణు తొట్టెంపూడి.. చాలా కాలం తరువాత.. వేణుతో నేను స్వయంవరం చేయాలి. కానీ అప్పట్లో మిస్ అయ్యాను. మళ్లీ కలిశాం.. ఇకనుంచి గ్యాప్ తీసుకోకు వేణు.. ఇరగతీసేద్దాం. ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ శరత్ మండవ.. చాలా మంచి సినిమా తీశాడు ఇతను. మొదటి సినిమా డైరెక్టర్ లా అనిపించదు.. ఇంటర్వ్యూలు చూశారు గా.. ఏ డైరెక్టర్ ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఉండడు. ఇక జూలై 29 న అందరూ థియేటర్లో సినిమా చూడండి.. లవ్ యూ ఆల్” అంటూ చెప్పుకొచ్చారు