Site icon NTV Telugu

Raviteja: ఫ్యాన్స్ గెట్ రెడీ.. వాల్తేరు వీరయ్య తమ్ముడు ఎంట్రీ షురూ

Chiru;

Chiru;

Raviteja: మెగా ఫ్యాన్స్ సిద్ధం కండి. మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ ఇవ్వనున్నాడు.. ఎందులో.. ఎప్పుడు అని అనుకుంటున్నారా.. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ చిత్రంలో చిరు- రవితేజ అన్నదమ్ములుగా నటించారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ మధ్యనే అన్న చిరు ఫస్ట్ లుక్ పోస్టర్, బాస్ పార్టీ సాంగ్ తో రచ్చ రేపాడు. ఇక తాజాగా తమ్ముడు ఎంట్రీకి ముహూర్తం ఖరారు చేశారు.

మాస్ బ్లాస్ట్ తో రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ను డిసెంబర్ 12 ఉదయం 11 గంటల 07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక పోస్టర్ లో రవితేజ లుక్ అంత క్లియర్ గా కనిపించకపోయినా ఆ కటౌట్ మాస్ మహారాజాదే అని తెలుస్తోంది. చిన్నపాటి సిలిండర్ ను గొడ్డలితో లాక్కెళుతూ కనిపించాడు. దీంతో మాస్ మహారాజా ఈ సినిమాలో కూడా మంచి ఊర మాస్ క్యారెక్టర్ నే చేస్తున్నట్లు తెలిసిపోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 20 ఏళ్ళ తరువాత చిరు- రవితేజ అన్నదమ్ములుగా కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.

Exit mobile version