Site icon NTV Telugu

Dhamaka: ట్విట్టర్ రివ్యూ…

Dhamaka

Dhamaka

మాస్ మహారాజా రవితేజ నటించిన ఊర మాస్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. రవితేజ ఈమధ్య కాలంలో ఏ సినిమాకి చేయనంత ప్రమోషన్స్ ని ‘ధమాకా’ కోసం చేశాడు. టీజర్ నుంచి మొదలుపెట్టి సాంగ్స్, ట్రైలర్ తో పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చెయ్యడంలో ధమాకా చిత్ర యూనిట్ సూపర్ సక్సస్ అయ్యింది. ముఖ్యంగా సాంగ్స్ చార్ట్ బస్టర్ అవ్వడం ధమాకా సినిమాపై అంచనాలు పెరగడానికి కారణం అయ్యింది. రవితేజ హిట్ కొడతాడు అనే నమ్మకాన్ని కలిగించిన ధమాకా సినిమా ఎట్టకేలకు ఈరోజు రిలీజ్ అయ్యింది. మార్నింగ్ షో అన్ని ఏరియాల్లో స్టార్ట్ అయిపోయాయి. కొన్ని చోట్ల ప్రీమియర్స్ పడడంతో ట్విట్టర్ లో రవితేజ ఫాన్స్ హంగామా చేస్తున్నారు.

ఫుల్ మూవీ రివ్యూ ఇంకా బయటకి రాలేదు కాబట్టి ట్విట్టర్ లో వస్తున్న టాక్ ని బట్టి చూస్తే… దాదాపు అందరి నుంచి పాజిటివ్ ట్వీట్స్ వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత రవితేజలో ఒకప్పటి ఎనేర్జి చూసామని, కిక్ ప్లస్ విక్రమార్కుడు చూసినట్లు ఉందని కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. కొందరు యాంటి ఫాన్స్ మాత్రం రవితేజ ధమాకా లాంటి రొటీన్ మాస్ మసాలా సినిమాలు చెయ్యడం ఆపేయాలి, అదే రెగ్యులర్ స్టఫ్ తో సినిమాలు చేస్తున్నాడు అంటున్నారు. ఈ కామెంట్స్ చూసిన రవితేజ ఫాన్స్, షోస్ కంప్లీట్ అవ్వకుండానే రివ్యూస్ ఎలా ఇస్తున్నారు? రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ప్రిడిక్బుటల్ స్టోరీలే ఉంటాయి. మీ హీరోలేమైనా అద్భుతాలు, అవతార్ సినిమాలు చేస్తున్నారా? అంటూ రివర్స్ కౌంటర్ వేస్తున్నారు. మరి రవితేజ ఫాన్స్ కరెక్టా లేక యాంటి ఫాన్స్ కరెక్టా అనేది తెలియాలి అంటే ఇంకొంచెం సేపు ఆగాల్సిందే.

Exit mobile version