మాస్ మహారాజ రవితేజ హీరోగా, గ్లామరస్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన తాజా మాస్ ఎంటర్‌టైనర్ “మాస్ జాతర” రేపటి నుంచి గ్రాండ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ఫ్యాన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రవితేజ స్టైల్, ఎనర్జీ, బాను భోగవరపు దర్శకత్వం కలిస్తే ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు.
Also Read : Ikkis : యుద్ధ గాధతో గర్వం నింపిన.. అగస్త్య నంద తొలి చిత్రం ‘ఇక్కీస్’ ట్రైలర్ రిలీజ్ ..!
ఇక సినిమా విడుదలకు ముందే మేకర్స్ ఒక “సీక్రెట్ సర్ప్రైజ్” ఉందని హింట్ ఇచ్చారు. అదేంటా అని ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిపోయింది. తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఆ సర్ప్రైజ్ వెనుక ఉన్న పేరు రమణ గోగుల అనే టాక్ హాట్ టాపిక్‌గా మారింది! గతంలో “తొలివాలపు,” “బద్రి,” “యువరాజు,” “చిత్రం” వంటి సూపర్‌హిట్ ఆల్బమ్‌లతో యూత్ హార్ట్‌ను గెలుచుకున్న ఈ వింటేజ్ మ్యూజిక్ మాస్ట్రో, చాలా కాలం తర్వాత మళ్లీ రవితేజ సినిమా ద్వారా రీ-ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం. ఇటీవలే ఆయన “భీమ్స్ సంక్రాంతికి వస్తున్నాం”లో అందించిన మ్యూజిక్‌తో తన స్టైల్‌కి అభిమానులు ఫిదా అయ్యారు. మరి ఇప్పుడు “మాస్ జాతర”లో రమణ గోగుల ఇచ్చిన సర్ప్రైజ్ స్పెషల్ సాంగ్ ఆ? వింటేజ్ థీమ్ ట్యూన్ ఆ? లేక రవితేజ కోసం సొంత వాయిస్‌తో పాడిన పాట ఆ? అన్నది రేపు సాయంత్రం థియేటర్లలోనే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ, రమణ గోగుల రీ-ఎంట్రీతో “మాస్ జాతర” మ్యూజికల్ జాతరగా మారడం ఖాయం.
