మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టేలా ఉన్నాడు రవితేజ అనే కామెంట్స్ వినిపించాయి.
Also Read : OG day 2 collection : రెండు రోజుల కలెక్షన్స్ తో వంద కోట్ల షేర్ క్లబ్ లో పవర్ స్టార్..
కాగా ఈ సినిమా ఈ ఏడాది ఈ నెల 27న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 12న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు. కానీ సెప్టెంబర్ లో కూడా విడుదల కాలేదు. షూటింగ్ పెండింగ్ ఉండడంతో సెప్టెంబర్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసారు మేకర్స్. దాంతో షూటింగ్ పార్ట్ ను చక చక ఫినిష్ చేస్తున్నారు మేకర్స్. తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. లక్ష్మణ్ భేరి అనే పాత్రలో మాస్ మహారాజా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. తాజాగా మాస్ జాతర రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ముందుగా దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు కానీ అక్కడ కుదరకపోవడంతో అక్టోబరు 31న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు. నేటి నుండి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. గత సంవత్సరం దీపావళి రిలీజ్ అనుకున్న సినిమా ఈ ఏడాది అక్టోబరు చివర్లో వస్తుంది.
