NTV Telugu Site icon

Marvel: మూడు రోజుల్లో రిలీజ్ ఉంది కానీ బజ్ లేదు… MCU పనైపోయిందా?

Marvel

Marvel

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4, ‘వకాండా ఫరెవర్’ సినిమాతో కంప్లీట్ అయ్యింది. ‘వకాండా ఫరెవర్’ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది కానీ ఫేజ్ 4లో వచ్చిన మిగిలిన మార్వెల్ సినిమాలని చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. MCU పై ఆడియన్స్ లో ఇంటరెస్ట్ తగ్గుతూ ఉంది, ఇలాంటి సమయంలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మళ్లీ పుంజుకోవాలి అంటే ఫేజ్ 5లో అద్భుతాలు జరగాలి. 2023 నుంచి 2024 మిడ్ వరకూ మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలు ఫేజ్ 5 కిందకి వస్తాయి. ఈ ఫేజ్ 5లో మొదటి సినిమాగా ‘ఆంట్ మాన్ అండ్ ది వాస్ప్: క్వాంటూమేనియ'(Ant-Man and the Wasp: Quantumania) 2023 ఫిబ్రవరి 17న విడుదల అయ్యింది కానీ బాక్సాఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపించలేదు. దీంతో MCU పని అయిపొయింది, ఇకపై సూపర్ హీరో సినిమాలకి మార్కెట్ తగ్గిపోతుంది అనే కామెంట్స్ మరింతగా వినిపించడం మొదలయ్యింది.

‘ఆంట్ మాన్ అండ్ ది వాస్ప్: క్వాంటూమేనియ’ తర్వాత సమ్మర్ లో ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3′(Guardians of the Galaxy Vol. 3) మే 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. మూడు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ మూవీపై కూడా ఎలాంటి బజ్ లేదు. అసలు మార్వెల్ నుంచి సినిమా వస్తుంది అనే విషయమే కొంతమందికి తెలిసి ఉండదు, అలాంటి ఫేజ్ లో ఉంది MCU ఇప్పుడు. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ సీరీస్ కి ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు, ఇప్పటికే రిలీజ్ అయిన రెండు వాల్యూమ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి సహజంగానే ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’పైన మంచి అంచనాలు ఉండాలి కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు.

నిజానికి ప్రతి సినిమాకి, ప్రతి హీరోకి అంతెందుకు ప్రపంచంలో ప్రతి విషయానికి ఒక పీక్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ చేరుకోగానే డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. మళ్లీ కింద నుంచి పోరాటం మొదలుపెట్టాలి. ప్రస్తుతం MCU ఇలాంటి స్టేజ్ లోనే ఉంది. ఎండ్ గేమ్ సినిమా ఆడియన్స్ కి పీక్ స్టేజ్ లో ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇచ్చేసింది. కొన్ని మేజర్ క్యారెక్టర్స్ కూడా ఎండ్ అయిపోయాయి. ఇలాంటి సమయంలో కొత్త క్యారెక్టర్స్ కి, కొత్త ట్రాక్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది.

Show comments