NTV Telugu Site icon

Adi Saikumar: సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్న ‘టాప్ గేర్’ టీజర్!

Top Gear

Top Gear

Top Gear: ఏడాది వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు యంగ్ హీరో ఆది సాయి కుమార్. విరామం లేకుండా సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు ‘టాప్ గేర్’ అంటూ మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. విశేషం ఏమంటే… ఇది ఈ యేడాది విడుదల కాబోతున్న ఆది ఐదో చిత్రం! ఈ చిత్రానికి కె. శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో కె.వి. శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘టాప్ గేర్’ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా సిద్ శ్రీరామ్ పాడిన ‘వెన్నెల…’ పాట ఇలా అన్నింటిపైనా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.

ఈ నేపథ్యంలో తాజాగా శనివారం దర్శకుడు మారుతి చేతుల మీదుగా చిత్ర బృందం టీజర్ ను లాంచ్ చేసింది. ఒక నిమిషం 21 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లోని డైలాగ్స్, సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. టాప్ గేరేసి కారులో ఆది సాయి కుమార్ దూసుకుపోవడం, ఆయన్ను వెంబడిస్తున్న పోలీసులు, మధ్యలో ఫోన్ కాల్స్ సినిమాలో ఉన్న వైవిధ్యాన్ని బయటపెడుతున్నాయి. ఈ టీజర్ లో విజువల్స్ మేజర్ హైలైట్ కాగా.. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. దాంతో విడుదల చేసిన కాసేపట్లోనే ఈ ‘టాప్ గేర్’ టీజర్ వైరల్ గా మారింది.

టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి చిత్రయూనిట్ ను ప్రత్యేకంగా అభినందించారు. టీజర్ చాలా బాగా కట్ చేశారని, టీజర్ చూస్తుంటేనే ఈ సినిమా ఎంత బాగా వచ్చిందో అర్థమవుతోందని చెబుతూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. పలు విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన సాయి శ్రీరామ్ దీనికి అద్భుతమైన విజువల్స్ అందించారు. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించారు. రియా సుమన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, ‘సత్యం’ రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు.

Show comments