Site icon NTV Telugu

Pawan Kalyan : మార్క్ శంకర్ హెల్త్ బులిటెన్.. ఇప్పుడెలా ఉందంటే..?

Mark Shankar

Mark Shankar

పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే కొద్దీసేపటి క్రితం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు వైద్యులు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ అధికారక వర్గాలు ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.

Also Read : Manchu Case : జల్‌పల్లిలో మంచు వారి జగడం

అందులో మార్క్ శంకర్ కు వైద్య పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ ను చూశారు. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియచేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారని లేఖలో పేర్కొన్నారు. పవన్ కుమారుడిని పరామర్శించేందుకు మెగాస్టార్ చిరు దంపతులు సింగపూర్ చేరుకున్నారు.

Exit mobile version