ఇటీవల ఇండియన్ సినిమా దగ్గర అత్యంత చర్చనీయాంశంగా మారిన వైలెంట్ యాక్షన్ డ్రామా మార్కో. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా, దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు, హిందీ వెర్షన్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టి సక్సెస్ ఫుల్ రన్ అందుకుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, రా ప్రెజెంటేషన్ ఈ సినిమాకి బలంగా నిలిచిన, దాని వైలెంట్ కంటెంట్ కారణంగా పలు వివాదాలు రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కో సీక్వెల్ గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి. ఒక దశలో ఇది వాయిదా పడుతుందనే మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ అనుమానాలకు ఫుల్‌స్టాప్ పడింది. మేకర్స్ అధికారికంగా సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.
Also Read : OG : సెన్సార్ పనులు ముగించుకున్న ‘ఓజి’
కాగా ఈ సీక్వెల్‌కు ‘లార్డ్ మార్కో’ అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే ఇందులో హల్‌చల్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ టాక్ ఏంటీ అంటే ఈ సీక్వెల్‌లో హీరోగా ఉన్ని ముకుందన్ కనిపించకపోవచ్చని వినిపిస్తోంది. కొత్త లీడ్ లేదా వేరే యాంగిల్‌తో కథను నడపాలనే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక మరోవైపు ఉన్ని ముకుందన్ గురించి మరో పెద్ద వార్త బయటకు వచ్చింది. ఆయనపై ప్రధాని నరేంద్ర మోదీ జీవిత ఆధారంగా భారీ స్థాయి బయోపిక్ ప్రకటించబడింది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో ఉన్ని కెరీర్‌లో కొత్త దశ మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. అంతకు ముందు క్రియేట్ చేసిన క్రేజ్ దృష్ట్యా, లార్డ్ మార్కో కోసం మాస్ ఆడియన్స్ భారీగా ఎదురుచూస్తారనడంలో సందేహం లేదు.
