Many hope on Sita Ramam
దుల్కర్ సల్మాన్ నటించిన ‘సీతా రామం’ ఈ నెల 5న విడుదల కాబోతోంది. విడుదలైన ట్రైలర్, పాటలకు చక్కటి స్పందన రావటంతో ఇటు చిత్రపరిశ్రమలో అటు ట్రేడ్ వర్గాలలో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక పలువురు నిర్మాతలు ఈ సినిమాపై నమ్మకంతో తామూ భాగస్వాములయ్యారు. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను సితార నాగవంశీ తీసుకోగా, ఆసియన్ సునీల్ నైజాం హక్కులను పొందారు. ఇక హిందీలో ‘ఆర్ఆర్ఆర్’ను విడుదల చేసిన జయంతిలాల్ గడా పెన్ స్టూడియోస్ హిందీ హక్కులను దక్కించుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ కృష్ణా జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో పంపిణీ చేస్తోంది. అలాగే తమిళనాట ఈ సినిమా రిలీజ్ హక్కులను లైకా ప్రొడక్షన్స్ చేజిక్కించుకుంది. మలయాళంలో ఏకంగా ఈ సినిమా హీరో దుల్కర్ వేఫేరర్ సంస్థ ద్వారా విడుదల చేస్తున్నాడు. ఇలా వీరందరూ సినిమాపై, స్వప్న సినిమా ట్రాక్ రికార్డ్ పై నమ్మకంతో ఫ్యాన్సీ మొత్తాలను చెల్లించి మరీ విడుదల చేస్తుండటం విశేషం. దీనికి తోడు ఈ ప్రచారాన్ని యూనిట్ వెరైటీగా ప్లాన్ చేయటం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావటం వంటివి సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. మరి పెరిగిన ఈ అంచనాలకు అనుగుణంగా సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి.