Site icon NTV Telugu

Varun Tej: చూపించకున్నా చెప్పేస్తున్నారు బాసు… తను ఎవరో తెలిసిపోయింది

Vt 13

Vt 13

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి స్పీడ్ మీదున్నాడు. ఒక సినిమా కంప్లీట్ అయ్యాకే ఇంకో సినిమాని మొదలుపెట్టే వరుణ్ తేజ్ ఈసారి మాత్రం ఒకేసారి రెండు సినిమాలని సెట్స్ పైకి తీసుకోని వెళ్లాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్న వరుణ్ తేజ్, ఈ సినిమా కంప్లీట్ చేయకుండానే శక్తి ప్రతాప్ సింగ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఇంకో సినిమాని మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ మూవీ ఒక షెడ్యూల్ షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇటివలే రిలీజ్ చేసిన వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి హీరోయిన్ లుక్ ని రివీల్ చెయ్యబోతున్నాం అనే అనౌన్స్మెంట్ వచ్చింది. హీరోయిన్ ఫేస్ ని రివీల్ చెయ్యకుండా ఒక సిలవుట్ ఫోటోని మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇందులో ఆ హీరోయిన్ ఎవరో అనేది సరిగ్గా కనిపించట్లేదు కానీ సినీ అభిమానులు మాత్రం ఈ పోస్టర్ లో ఉన్నది బాలీవుడ్ బ్యూటీ ‘మానుషీ చిల్లర్’ అంటూ గెస్ చేస్తున్నారు. ‘మిస్ వరల్డ్ 2017’గా గెలిచిన మానుషీ చిల్లర్ హిందీలో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో పక్కన నటించింది కానీ ఆశించిన స్థాయి పేరుని మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు సౌత్ వైపు అడుగులు వేస్తున్న ఈ బ్యూటీకి వరుణ్ తేజ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఎయిర్ ఫోర్స్ నేపధ్యంలో రూపొందుతున్న సినిమా కాబట్టి లాంగ్వేజ్ బారియర్స్ ఉండవు, అన్ని భాషల్లో సినిమా చెయ్యగలిగే స్కోప్ ఉంటుంది. సో సినిమా బాగుండి హిట్ కొడితే మానుషీ చిల్లర్ కి సౌత్ లో మంచి డెబ్యు దొరుకుతుంది. అలానే హిట్ కోసం వెయిట్ చేస్తున్న వరుణ్ తేజ్ ఫ్లాప్ స్ట్రీక్ కూడా బ్రేక్ అవుతుంది.

Exit mobile version