Site icon NTV Telugu

Mansoor Ali Khan: త్రిష రేప్ కామెంట్స్.. లేఖ రిలీజ్ చేసిన మన్సూర్ అలీ ఖాన్

mansoor

Mansoor Ali Khan Clarity on His Comments about Trisha: నటి త్రిషపై తాను చేసిన ప్రసంగంపై నటుడు మన్సూర్ అలీఖాన్ వివరణ ఇచ్చారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, మన్సూర్ అలీఖాన్, ఒక జర్నలిస్ట్ ప్రశ్నకు సమాధానమిస్తూ, నటి త్రిష గురించి చాలా అసహ్యంగా మాట్లాడారు. త్రిషతో సినిమా అంటే గతంలో కొందరు హీరోయిన్లను రేప్ చేసినట్టుగానే చేయిస్తారు అనుకున్నా, కానీ అసలు కాశ్మీర్ షెడ్యూల్ లో ఆమె నాకు కనిపించను కూడా లేదు అంటూ కామెంట్ చేశాడు. ఈ ప్రసంగంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మన్సూర్ అలీఖాన్ ప్రసంగం గురించి త్రిష కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, అతనిలాంటి వ్యక్తులు మానవాళికి అవమానకరమని, ఇకపై తన సినీ కెరీర్‌లో అతనితో కలిసి నటించనని పేర్కొంది. త్రిషకి మద్దతుగా దర్శకుడు లోకేష్, సుబ్బరాజు, నటి మాళవిక మోహనన్ తదితరులు మన్సూర్ అలీ ఖాన్‌ మాటలను ఖండించారు.

Salaar :సలార్ ట్రైలర్ పై లేటెస్ట్ అప్డేట్.. వైరల్ అవుతున్న మిస్ నీల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్..

మరోవైపు తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో మన్సూర్‌ అలీ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందని… తనను గౌరవిస్తున్నానని చెప్పుకొచ్చారు, నేను త్రిష గురించి గొప్పగా చెప్పుకొచ్చా అయితే వివాదాలను సృష్టించడానికి దానిని ఎడిట్ చేశారు. పాత సినిమాల్లో కథానాయికలతో నటించే అవకాశాలు రాలేదని, నా ఆవేదనను అలా హాస్యాస్పదంగా వ్యక్తం చేశా అంటూ రాసుకొచ్చారు. వీడియోను, తప్పుగా ఎడిట్ చేసి దాన్ని త్రిషకు చూపించారన్న ఆయన తోటి నటీమణులను తాను ఎప్పుడూ గౌరవిస్తానని అందరికీ తెలుసునని కూడా పేర్కొన్నాడు. కాబట్టి, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నందున, తన రాబోయే సిని, రాజకీయ ప్రయాణాన్ని చెడగొట్టడానికేనని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version