NTV Telugu Site icon

Adipurush: నాకు ప్రొటెక్షన్ ఇప్పించండి.. పోలీసులకు ‘ఆదిపురుష్’ రైటర్ విజ్ఞప్తి!

Adipurush Writer Police Pro

Adipurush Writer Police Pro

Manoj Muntashir Seeks Police Protection: ఒక పక్క ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ థియేటర్లలో వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తుండగా, థియేటర్ల వెలుపల మాత్రం కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. అందరికంటే ఎక్కువగా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘ఆదిపురుష్’ పాత్రలకు మనోజ్ ముంతాషీర్ రాసిన డైలాగులు అయన టార్గెట్ అయ్యేలా చేస్తున్నాయి. మరీముఖ్యంగా ఆయన హనుమంతుడికే కోసం రాసిన పలు డైలాగులపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పెరుగుతున్న వివాదాన్ని చూసి, మేకర్స్ ఈ చిత్రం యొక్క అనేక డైలాగ్‌లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అయినా జనాల్లో ఆగ్రహం తగ్గకపోవడంతో మనోజ్ ముంతషీర్ ముంబై పోలీసుల నుంచి భద్రత కల్పించాలని కోరారు. మనోజ్ తనకు ప్రమాదమని భయాందోళన వ్యక్తం చేశాడు. మనోజ్ ముంతాషిర్ శుక్లా ‘ఆదిపురుష్’ డైలాగ్‌స్పై ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని ముంబై పోలీసుల నుండి రక్షణ కోరాడు. తనపై దాడి జరుగుతుందని మనోజ్ భయపడుతున్నాడు. సోషల్ మీడియాతో పాటు మెయిల్‌కి కూడా బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయని చెబుతున్నారు.
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ సంచలన నిర్ణయం.. సినిమాలకు గుడ్ బై
అటువంటి పరిస్థితిలో, తన భద్రత గురించి ముంబై పోలీస్ DSP జోన్ 9ని కలిశాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని మనోజ్ ముంతాషిర్ పోలీసులకు తెలిపాడు. ఆదిపురుష్‌లో రామ్‌గా నటుడు ప్రభాస్‌ నటిస్తుండగా, సీత మాతగా నటి కృతి సనన్‌ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించాడు. ఇక తన డైలాగ్ రైటింగ్‌పై క్లారిటీ ఇస్తూ, మనోజ్ తాజా ఇంటర్వ్యూలో క్షమాపణలు చెప్పడానికి నిరాకరించాడు. ‘చూసుకోకుండా డైలాగులు రాస్తారా’ అని మనోజ్‌ని ప్రశ్నించగా. దీనిపై మనోజ్ ముంతాషిర్ స్పందిస్తూ, ‘ఇది టీమ్‌వర్క్, నేను ఓం రౌత్‌ను పూర్తిగా విశ్వసించానని, ఆయన కూడా నా డైలాగ్స్ ను విశ్వసించారని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో మీరు క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నిస్తే మనోజ్ ముంతాషీర్ స్పందిస్తూ.. ‘నేను అస్సలు క్షమాపణ చెప్పను’ అని చెప్పాడు. ఇక ఈ క్రమంలో మనోజ్ ముంతాషీర్ శుక్లాకు భద్రత కల్పించాలని ముంబై పోలీసులు నిర్ణయించారు . వివాదాస్పద డైలాగ్‌లను త్వరలో మారుస్తామని మనోజ్ ముంతాషీర్ పేర్కొన్నప్పటికీ జనాలు ఆయనని వదిలేలా కనిపించడం లేదు.