Site icon NTV Telugu

కేఆర్‌కేపై “ఫ్యామిలీ మ్యాన్” పరువు నష్టం దావా

Manoj Bajpayee filed a defamation complaint in Indore court on KRK

బాలీవుడ్ ప్రముఖులపై చిర్రెత్తే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ? అంటే అది ఖచ్చితంగా నటుడు, సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ మాత్రమే. కేవలం సినిమాలకే ఆయన విమర్శలు పరిమితం అయితే పర్లేదు. కానీ మనుషులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఈయన నైజాం. సల్మాన్ ఖాన్ ఇటీవల కేఆర్‌కేపై పరువు నష్టం దావా వేయడానికి కారణం ఇదే. ఇప్పుడు మరోసారి మరో నటుడు కేఆర్‌కేకి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నాడు. మంగళవారం ఇండోర్ జిల్లా కోర్టులో “ఫ్యామిలీ మ్యాన్” నటుడు మనోజ్ బాజ్‌ పాయ్ విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ అలియాస్ “ఫ్యామిలీ మ్యాన్”పై పరువు నష్టం దావా వేశారు. కమల్ ఆర్ ఖాన్ మనోజ్ బాజ్‌పేయికి వ్యతిరేకంగా ఆయనను వ్యక్తిగతంగా కించపరిచే ట్వీట్ చేయడమే దీనికి కారణం అని తెలుస్తోంది. తాజాగా మనోజ్ తరపు న్యాయవాది పరేశ్ ఎస్ జోషి ఈ కేసు గురించి మీడియాకు సమాచారం ఇచ్చారు.

Read Also : అమితాబ్ కార్ సీజ్… కారణం సల్మాన్ ఖాన్ !!

కమల్ ఆర్ ఖాన్ చేసిన అభ్యంతరకర ట్వీట్‌కు సంబంధించి కోర్టు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (జెఎమ్‌ఎఫ్‌సి) ముందు నటుడి తరపున ఫిర్యాదు సమర్పించబడినట్లు మనోజ్ తరపు న్యాయవాది పరేశ్ ఎస్ జోషి చెప్పారు. ఈ ఫిర్యాదులో సెక్షన్ 500 ప్రకారం కేఆర్‌కే పై పరువు నష్టం కేసు నమోదు చేశారు. జూలై 26న బాజ్‌పేయి గురించి కించపరిచే ట్వీట్ చేసారని, ఈ కారణంగా అతని అభిమానుల ముందు నటుడి ప్రతిష్ట దెబ్బతింటుందని ఆరోపించారు. మొత్తానికి కేఆర్‌కేకి గుణపాఠం నేర్పించాలని నిశ్చయించుకుని ఈ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై కేఆర్‌కే నుండి ఎటువంటి స్పందన లేదు. ఇంతకుముందు కేఆర్‌కే సల్మాన్ “రాధే” చిత్రం గురించి సమీక్షించనప్పుడు, సల్మాన్ ఖాన్ అతనిపై పరువు నష్టం కేసు వేశారు. ఆ సమయంలో కేఆర్‌కేను కోర్టు గట్టిగా మందలించింది. అతనికి సంబంధించిన వీడియోలను కూడా కోర్టు తొలగించింది.

Exit mobile version