Site icon NTV Telugu

మహేశ్ సోదరి న్యూ ఇన్నింగ్స్ ‘మళ్లీ మొదలైంది’!

Manjula Ghattamaneni second innings Start again

సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా అప్పట్లో రమేశ్ బాబు వచ్చాడు. తరువాత ప్రిన్స్ మహేశ్ బాబు వచ్చాడు. ఇప్పుడు మన ‘సరిలేరు నీకెవ్వరు’ స్టార్ పరిస్థితి ఏంటో మనకు తెలిసిందే! ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ గా వెలిగిపోతున్నాడు! ఘట్టమనేని నట వారసులంటే రమేశ్ బాబు, మహేశ్ బాబే కాదు కదా… ఎస్, మంజుల కూడా మరోసారి పెద్ద తెర మీదకి వస్తోంది. దాదాపు దశాబ్దం తరువాత ఇంకో సారి ఆమె కెమెరా ముందుకు వచ్చింది. కమ్ బ్యాక్ కి సూటయ్యేలా ‘మళ్లీ మొదలైంది’ అనే టైటిల్ ఉన్న సినిమాలో మంజుల డాక్టర్ గా నటించింది. ‘డాక్టర్ మిత్ర’-థెరపిస్ట్ గా మీ ముందుకొస్తున్నాను అంటూ మహేశ్ సోదరి స్వయంగా అనౌన్స్ చేసింది.

Read Also : హేమపై ‘మా’ క్రమశిక్షణా చర్యలు తప్పవా!?

మంజుల ఘట్టమనేని కమ్ బ్యాక్ మూవీ ‘మళ్లీ మొదలైంది’లో హీరో సుమంత్. సినిమాలో నటించినందుకు ‘థాంక్యూ సిస్’ అంటూ కామెంట్ చేశాడాయన. ఇక పెళ్లి, విడాకులు, డైవోర్స్ తరువాత లైఫ్…. వంటి అంశాలతో కథ నడుస్తుందని ‘మళ్లీ మొదలైంది’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మేకర్స్ ఇప్పటికే తెలిపారు. తాజాగా మంజుల క్యారెక్టర్ లుక్ కూడా విడుదల చేశారు. ‘మళ్లీ మొదలైంది’ సెప్టెంబర్ లో థియేటర్స్ కు వచ్చే అవకాశం ఉంది. సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మంజుల చివరిసారిగా, 2013లో శ్రీకాంత్ ‘సేవకుడు’లో కనిపించింది. 2020లో ‘మనసుకు నచ్చింది’ అనే సినిమాను డైరెక్ట్ చేసిన మంజుల ఇటీవల సొంతంగా వెబ్ సైట్ తో పాటు యు ట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతోంది. అంతే కాదు ‘నషా’ పేరుతో నిర్మాగా వెబ్ సీరీస్ కూడా ప్లాన్ చేసింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘మళ్లీ మొదలైంది’తో నటిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మంజుల ఈ సారైనా నటిగా తనదైన ముద్ర వేస్తుందేమో చూడాలి.

Exit mobile version