Site icon NTV Telugu

Manjima Mohan: అఫీషియల్.. తమిళ హీరోతో నాగచైతన్య హీరోయిన్ ప్రేమాయణం

Manjima Mohan

Manjima Mohan

Manjima Mohan: నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మంజిమా మోహన్. అనంతరం ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆమె నారా భువనేశ్వరి పాత్రలో నటించింది. ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దగుమ్మ ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీగా ఉంది. ప్రస్తుతం తమిళ హీరో గౌతమ్ కార్తీక్‌తో ప్రేమాయణం నడుపుతోంది. ఈ విషయాన్ని మంజిమా మోహన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు లవ్, ఇన్ఫినిటీ, దిష్టిచుక్కల ఎమోజీలను షేర్ చేసింది. గౌతమ్ కార్తీక్ కూడా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. దీంతో అభిమానులు వీళ్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read Also: Andhra Pradesh: ఒకే ఫ్రేములో వైసీపీ, టీడీపీ ఎంపీలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

ప్రస్తుతం మంజిమా మోహన్ తెలుగులో అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్, నివేదా పెతురాజ్, మేఘా ఆకాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి నాన్న ఫేమ్ ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు అభినందన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన హీరో కార్తీక్ కుమారుడే గౌతమ్ కార్తీక్. అతడు ప్రస్తుతం శింబుతో కలిసి ‘పాథు తల’ అనే సినిమా చేస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన కడల్ సినిమాతో హీరోగా గౌతమ్ కార్తీక్ పరిచయమయ్యాడు. అటు గౌతమ్ కార్తీక్-మంజిమా కలిసి 2019లో విడుదలైన దేవరాట్టం అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అఫీషియల్‌గా ప్రకటించడంతో త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు.

Exit mobile version