Manisha Koirala Birthday Special : మనీషా కొయిరాల… అందాల లీల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manisha Koirala Birthday Special :లేలేత అందాలు, నాజూకు షోకులతో జనం ముందు నిలచిన మనీషా కొయిరాలను చూడగానే ‘నేపాలీ బాల’ అన్నారు ప్రేక్షకులు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వయసు మీద ఆమెను అభిమానులు అలాగే ఆరాధిస్తూ ఉండడం విశేషం! ఖాట్మాండ్ లో పుట్టినా, హిందీ సినిమాలతోనే మన జనానికి సుపరిచితురాలయింది మనీషా. కేన్సర్ ను సైతం జయించి, ఆ వ్యాధిపై జనాల్లో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారామె. మహిళా హక్కుల కోసం కూడా మనీషా తనదైన రీతిలో పోరాటం సాగిస్తున్నారు.
మన సరిహద్దుల్లో ఉన్న నేపాల్ అసలైన హిందూ దేశం అని ఎంతోమంది అంటూ ఉంటారు. అక్కడ కొయిరాలా వంశస్థులు అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకప్పటి నేపాల్ ప్రధాన మంత్రి బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాల మనవరాలు మనీషా. 1970 ఆగస్టు 16న ఖాట్మాండులో జన్మించారు మనీషా. ఆమె తండ్రి ప్రకాశ్ కొయిరాల కూడా పర్యావరణ, శాస్త్ర సాంకేతిక మంత్రిగా నేపాల్ ప్రభుత్వంలో పనిచేశారు. ప్రకాశ్ బాల్యం నుంచీ మనీషాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. చదువుకొనే రోజుల్లోనే థియేటర్ ఆర్ట్స్ పై మనసు పారేసుకుంది కొయిరాల. స్కూల్ లో కొన్ని నాటకాల్లో నటించిన మనీషా 1989లో ‘ఫెరీ భేతౌల’ అనే నేపాలీ చిత్రంలో తొలిసారి నటించింది. ఆ తరువాత సుభాష్ ఘయ్ తెరకెక్కించిన ‘సౌదాగర్’తో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది. అప్పటి నుంచీ తన దరికి చేరిన పాత్రల్లో నటించేస్తూ అనతికాలంలోనే నటిగా మంచి పేరు సంపాదించింది మనీషా కొయిరాల. మణిరత్నం తెరకెక్కించిన ‘బొంబాయి’ సినిమాతో దక్షిణాదికి వచ్చిన మనీషా, నాగార్జున ‘క్రిమినల్’లోనూ నటించి, తెలుగువారిని ఆకట్టుకుంది. శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు, ఒకే ఒక్కడు’ చిత్రాలలోనూ మనీషా అందాలు జనాన్ని మురిపించాయి. రజనీకాంత్ ‘బాబా’లోనూ మనీషా నటించి ఆకట్టుకుంది. శ్రీకాంత్ హీరోగా రూపొందిన ‘నగరం’ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో చిందేసింది మనీషా. 2014లో కేన్సర్ ను జయించిన మనీషా ఆ తరువాత నుంచీ మళ్ళీ నటించసాగారు. నెట్ ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’లో ఓ కథలో నాయికగా నటించారామె. సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజూ’లో ఆయన తల్లి నర్గీస్ పాత్రలోనూ మనీషా మురిపించారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా రూపొందుతోన్న ‘షెహజాదా’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారామె.
Also Read
- Ramayana : 'రామాయణ' లీక్‌పై మేకర్స్ వార్నింగ్.. షేర్ చేస్తే జైలుకే!
- Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
- Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..
- Ramayana Box Office Collections: బాక్సాఫీస్ వద్ద 'రామాయణ' ప్రభంజనం.. మొదటి భారతీయ చిత్రంగా అరుదైన ఘనత!
ఇప్పటికీ తనకు నచ్చిన పాత్రల్లో నటించడానికి మనీషా కొయిరాల ఉత్సాహంగానే ఉన్నారు. అలాగే సామాజిక సేవలోనూ తనవంతు కృషి చేస్తున్నారు. మనీషా మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
OTR: పాయల్ శంకర్ రైతు యాత్రకు అధిష్టానం నో.. అసలు కారణం ఏంటి…?
-
OTR: తాండూరులో ఇద్దరు పవర్ సెంటర్లు.. అన్నదమ్ముల ఆధిపత్య పోరుతో అధికారులకు తిప్పలు..
-
OTR : ఎమ్మిగనూరులో వైసీపీ తడబాటు.. నేతల అహంకారమే కారణమా..?
-
Story Board : ఢిల్లీ కాలుష్యాన్ని ఎంతకాలం భరించాలి ?జనం అనారోగ్యం పాలైనా పట్టించుకోరా ?
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?