NTV Telugu Site icon

PS-2: మూడు రోజుల్లో చోళులు వస్తున్నారు…

Ps 2

Ps 2

ఇండియన్ గేమ్ ఆఫ్ త్రోన్స్ గా పేరు తెచ్చుకున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా సెకండ్ పార్ట్ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మణిరత్నం అండ్ టీం అగ్రెసివ్ గా చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 500 కోట్లని రాబట్టి తమిళనాడులో బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఎన్ని కోట్లు వసూల్ చేసినా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాకి తమిళనాడు తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఆశించిన స్థాయి రిజల్ట్ మాత్రం రాలేదు. ఓవర్సీస్ లో పరవాలేదని పించిన PS-1, తెలుగు స్టేట్స్ లో బ్యాక్ లాష్ ఫేస్ చేసింది. తమిళ నేటివిటీ ఎక్కువగా ఉండడమే పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాకి ఇతర ప్రాంతాల ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. ప్రమోషన్స్ ని కూడా చిత్ర యూనిట్ భారి రేంజులో చెయ్యలేదు. ఈసారి పొన్నియిన్ సెల్వన్ 2 విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న మణిరత్నం, ప్రమోషన్స్ ని పక్కాగా ప్లాన్ చేసినట్లు ఉన్నాడు.

ముందు పోస్టర్స్, తర్వాత టీజర్, సాంగ్స్, లాస్ట్ లో ట్రైలర్… ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ని టైం చూసి అందరికీ రీచ్ అయ్యేలా వదులుతున్న చిత్ర యూనిట్ పొన్నియిన్ సెల్వన్ సినిమాలోని అన్ని పాటలని ఒకేసారి రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. మార్చ్ 29న పొన్నియిన్ సెల్వన్ 2 సాంగ్స్ ని విడుదల చెయ్యనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రెహమాన్ లండన్ లోని తన స్టూడియోలో సౌండ్ ని రీడిజైన్ చేసే పనిలో ఉన్నాడు. పాటలు బయటకి వచ్చిన రోజే పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ ని లాంచ్ చెయ్యనున్నారు. #CholasAreBack అనే ట్యాగ్ తో ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ ని చేసేశారు. సో పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అన్ని సెంటర్స్ లోని ఆడియన్స్ కి రీచ్ అవుతుందా లేక మరోసారి తమిళనేలకి మాత్రమే పరిమితం అవుతుందా అనేది మార్చ్ 29న ట్రైలర్ బయటకి రాగానే తెలిసిపోతుంది.

Show comments