Mani Sharma: మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలకు బెస్ట్ ఛాయిస్ అంటే మణిశర్మ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు మణిశర్మ అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. జనరేషన్ మారుతున్న కొద్దీ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ రావడంతో మణిశర్మ వెనక్కి తగ్గాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. స్టార్ హీరోలు.. ఎప్పుడు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ తో కాకుండా మిగతావారికి కూడా ఛాన్స్ ఇస్తే.. ప్రేక్షకులకు కూడా ఛేంజ్ ఉంటున్నట్లు ఉంటుంది కదా అని చెప్పుకొచ్చాడు. దేవీ శ్రీకి ఒకటి, తమన్ కు ఒకటి అలాగే తనకు ఒకటి.. ఇలా ఇస్తే ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ మ్యూజిక్ అందుతుందని మణిశర్మ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మణిశర్మ పంచుకున్నాడు. ముఖ్యంగా కాపీ ట్యూన్స్ మీరు కూడా చేశారా.. ? అన్న ప్రశ్నకు మణిశర్మ చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మీ కెరీర్ లో మీరెప్పుడైనా కాపీ ట్యూన్స్ అందించారా.. ? అన్న ప్రశ్నకు మణిశర్మ మాట్లాడుతూ.. ” నన్ను ఫోర్స్ చేశారు. రెండు మూడు సార్లు బలవంతంగా చేయించారు. ఎన్టీఆర్ నటించిన అది సినిమాలోని చిక్ చిక్ బం బం సాంగ్ కాపీ చేశాను. నాకు ఇష్టం లేకపోయినా చేశాను. కాపీ చేయడం ఏ కంపోజర్ కు ఇష్టముండదు. అంటారు కానీ, ఒరిజినల్ చేయాలనే అందరు కోరుకుంటారు.కొన్ని కొన్ని సార్లు బలవంతంగా జరుగుతూ ఉంటాయి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గామారాయి . ఇక ఆది లోని ఆ సాంగ్ కాపీ అనగానే.. దాని ఒరిజినల్ ఎక్కడా అని నెటిజన్స్ వెతకడం, కనిపెట్టడం కూడా జరిగింది. అది ఒక టర్కెన్ సాంగ్ అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఇంటర్వ్యూ తరువాత మణిశర్మ ఏమైనా అవకాశాలను అందుకుంటాడేమో చూడాలి.