Mani Sharma: సురేష్ కొండేటి “అభిమాని” సినిమాకి మణిశర్మ రీ – రికార్డింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “అభిమాని”. ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ఈ చిత్ర ట్యాగ్‍లైన్. భూలోకం, యమలోకం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాంబాబు దోమకొండ. ఎస్‍కే రహ్మాన్, కంద సాంబశివరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతాన్ని (పాటలు) అందిస్తున్నారు. ఈ అభిమాని సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా రీ రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు మకర సంక్రాంతి విశెస్ తెలియజేసింది మూవీ టీమ్. ఫిబ్రవరిలో “అభిమాని” సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా మెలొడీ బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ – అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి కంటెంట్ ఇంకా సోషల్ మెసేజ్ కలిగిన అభిమాని మూవీకి అంతే గొప్పగా నేపథ్య సంగీతం కుదిరింది.
ఇందులో ఉన్న అంశం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ప్రధాన పాత్రలో నటించిన సురేష్ కొండేటి బాగా నటించారు. ఆయన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ దోమకొండ రాంబాబు అనుకున్న కంటెంట్ ని అదే స్థాయిలో ప్రజెంట్ చేశారు. సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుండి నాకు పరిచయం. ఈ సినిమాలో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంటాడు. అభిమాని మూవీని మీరంతా సూపర్ హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అల్ ది బెస్ట్ సురేష్, అండ్ అభిమాని టీమ్ అన్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన అభిమాని సినిమా పోస్టర్, సురేష్ కొండేటి పుట్టిన రోజు సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. వచ్చే నెలలో రిలీజ్ కానున్న “అభిమాని” సినిమా ఇదే రెస్పాన్స్ ఉంటుందని మూవీ టీమ్ ఆశిస్తున్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?